STOCKS

News


స్పైస్‌జెట్‌ నుంచి ఎయిర్‌ కార్గో సర్వీసులు

Tuesday 11th September 2018
news_main1536641418.png-20145

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌ కంపెనీ ఈ నెల 18 నుంచి పూర్తి స్థాయి ఎయిర్‌ కార్గో సర్వీసులను ప్రారంభించనుంది. స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్రాండ్‌ కింద ఈ ఎయిర్‌ కార్గో సర్వీసులను అందిస్తామని స్పైస్‌జెట్‌ సీఎమ్‌డీ అజయ్‌ సింగ్‌ చెప్పారు.  పూర్తి స్థాయి ఎయిర్‌ కార్గో సేవలను అందిస్తున్న తొలి దేశీయ విమానయాన సంస్థ తమదేనని పేర్కొన్నారు.. బోయింగ్‌ 737-700 విమానాన్ని దీని కోసం వినియోగిస్తామని, ఇది 20 టన్నుల కార్గోను రవాణా చేయగలదని, తొలి సర్వీస్‌ను ఢిల్లీ నుంచి బెంగళూరుకు నిర్వహిస్తామని తెలిపారు.  ఆరంభంలో గౌహతి, హాంగ్‌కాంగ్‌, కాబూల్‌, అమృత్‌సర్‌లకు ఎయిర్‌ కార్గో సర్వీసులను అందిస్తామని పేర్కొన్నారు.  తాజా పండ్లు, కూరగాయలను పశ్చిమాసియా ప్రాంతానికి రవాణా చేస్తామని వివరించారు. ఐదేళ్లలో ఎయిర్‌ కార్గో ట్రాఫిక్‌ 60 శాతం వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎయిర్‌ కార్గో సర్వీసుల కోసం నాలుగు విమానాలను కేటాయిస్తామని, కెపాసిటీని రోజుకు 900 టన్నులకు పెంచుతామని తెలిపారు. తమ అనుబంధ వ్యాపార వృద్ధికి ఈ ఎయిర్‌కార్గో సర్వీసులు ఇతోధికంగా తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 



You may be interested

మార్కెట్లోకి లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్‌

Tuesday 11th September 2018

హైదరాబాద్‌: జపాన్‌ కంపెనీ టొయోటాకు చెందిన లగ్జరీ కార్ల విభాగం లెక్సస్‌.. అంతా కొత్తదైన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కారును భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈఎస్‌ 300హెచ్‌ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.59.13 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించామని లెక్సస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ తెలిపారు.  జూలైలోనే బుకింగ్‌లు... ఈ ఏడో తరం ఈఎస్‌ 300హెచ్‌ను 2.5 లీటర్‌, నాలుగు సిలిండర్‌  పెట్రోల్‌ ఇంజిన్‌తో, 44 వోల్ట్‌, 204 సెల్‌ నికెల్‌

36 క్లిష్ట ఆరోగ్య సమస్యలకు పాలసీ

Tuesday 11th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బీమా రంగ సంస్థ బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌... సోమవారం కొత్త​పాలసీని ప్రవేశపెట్టింది. బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ హెల్త్‌ కేర్‌ గోల్‌ పేరుతో రూపొందిన ఈ పాలసీ 36 రకాల క్లిష్ట ఆరోగ్య సమస్యలను కవర్‌ చేస్తుంది. ఒక ప్రీమియంతో ఒకే పాలసీ కింద ఆరుగురు సభ్యులున్న కుటుంబం లబ్ది పొందవచ్చు. రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవరేజ్‌ ఉంటుంది. సంప్రదాయ

Most from this category