STOCKS

News


స్పైస్‌జెట్‌లోకి మరో ఆరు బోయింగ్ 737ఎస్‌ విమానాలు

Friday 19th April 2019
news_main1555652675.png-25221

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌.. త్వరలోనే మరో ఆరు బోయింగ్ 737ఎస్‌ విమానాలను తన సేవల్లోకి జోడించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇందుకోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌కు ఎటువంటి అభ్యంతరం లేదనే సర్టిఫికేట్ (ఎన్ఓసీ) కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపింది. ఈ నూతన లీజింగ్‌ విమానాల ద్వారా ముంబై-ఢిల్లీ రూట్‌లో 24 నూతన సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మరో విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.You may be interested

డీసీబీ బ్యాంక్‌ లాభం 50 శాతం అప్‌

Friday 19th April 2019

- 14 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం  - ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ డీసీబీ బ్యాంక్‌ నికర లాభం 50 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.96 కోట్ల నికర లాభం సాధించామని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) నాలుగో త్రైమాసికంలో రూ.64 కోట్ల నికర లాభం వచ్చిందని డీసీబీ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ

భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!

Friday 19th April 2019

- విస్తరణపై ఈ-కామర్స్‌, స్టార్టప్‌ సంస్థల ఆసక్తి - తొలి 6 నెలల్లో 51వేల ఉద్యోగాలు - భారీగా నిధుల సమీకరిస్తున్న కంపెనీలు న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ సంస్థలు, స్విగ్గీ, గ్రోఫర్స్‌ వంటి స్టార్టప్‌ సంస్థలు డెలివరీ విభాగాన్ని విస్తరించటంపై దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరుకునేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో కస్టమర్లను సొంతం చేసుకునేందుకు సరఫరా

Most from this category