STOCKS

News


స్పైస్‌జెట్‌ నష్టాలు రూ.389 కోట్లు

Thursday 15th November 2018
news_main1542258905.png-22032

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.389 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఇంధన ధరలు పెరగడం, రూపాయి పతనం కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.105 కోట్ల నికర లాభం వచ్చిందని స్పైస్‌జెట్‌ సీఎమ్‌డీ అజయ్‌ సింగ్‌ చెప్పారు. గత క్యూ2లో రూ.1,795 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో రూ.1,848 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.2,300 కోట్లుగా ఉండగా, గత క్యూ2లో రూ.1,737 కోట్లని అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.  విమానయాన ఇంధనం ధరలు 48 శాతం, విదేశీ మారక ద్రవ్య రేటు 10 శాతం పెరగడంతో వ్యయాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. గత క్యూ2లో రూ.140 కోట్ల నిర్వహణ లాభం రాగా, ఈ క్యూ2లో రూ.322 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయని వివరించారు.
లోడ్‌ ఫ్యాక్టర్‌ ‘రికార్డ్‌’
ఈ క్యూ2లో రికార్డ్‌ స్థాయి లోడ్‌ ఫ్యా‍క్టర్‌, 93.5 శాతం సాధించామని అజయ్‌ సింగ్‌ తెలిపారు. మొత్తం విమానయాన రంగానికే ఈ క్యూ2 సమస్యాత్మక క్వార్టర్‌ అన్నారాయన. ‘‘దూకుడుగా నెట్‌వర్క్‌ను విస్తరించడం, కఠినమైన వ్యయ నియంత్రణ పద్ధతులు, ఉద్యోగుల అంకిత భావం, అధిక మైలేజీనిచ్చే విమానాలను వినియోగించడం వంటి కారణాల వల్ల ఈ క్యూ2 సమస్యలను తట్టుకోగలిగాం. విమాన చార్జీలు అధికంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగివస్తుండటం, రూపాయి పుంజుకోవటం వంటి సానుకూలాంశాల కారణంగా నిర్వహణ మరింతగా మెరుగుపడే అవకాశముంది. ఈ క్యూ3లో మరో పది బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను డెలివరీ తీసుకోనున్నాం. ఇక నాలుగో క్వార్టర్‌లో ఎనిమిది వరకూ మ్యాక్స్‌ విమానాలను అదనంగా అందుబాటులోకి తెస్తాం’’ అని అజయ్‌ సింగ్‌ వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్‌ షేర​ 2.8 శాతం లాభంతో రూ.83.70 వద్ద ముగిసింది. 
 



You may be interested

తగ్గిన హైరింగ్‌ అంచనాలు ..

Thursday 15th November 2018

ముంబై: దేశీయంగా కరెన్సీ పతనం, చమురు ధరల పెరుగుదల ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాల అంచనాలు 3 శాతం మేర తగ్గి 92 శాతానికి చేరాయి. ప్రథమార్ధంలో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) ఇది 95 శాతంగా ఉంది. టీమ్‌లీజ్‌ సంస్థ రూపొందించిన 2018-19 నియామకాల అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నియామకాల సెంటిమెంటుపై 14 నగరాల్లో 19 రంగాలకు చెందిన 750 చిన్న, మధ్య తరహా,

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.924 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.924 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఏడాది క్యూ2లో ఈ నికర నష్టాలు రూ.750 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు తెలియజేసింది. ఆదాయం తగ్గడం, మొండి బకాయిలు మరింతగా పెరగడంతో ఈ క్యూ2లో నికర నష్టాలు పెరిగాయని వెల్లడించింది. అయితే ఈ క్యూ1లో వచ్చిన నష్టాలు రూ.1,522 కోట్లతో పోలిస్తే ఈ సారి తగ్గినట్లే

Most from this category