STOCKS

News


జెట్‌ ఉద్యోగులకు స్పైస్‌జెట్‌ ఆసరా

Saturday 20th April 2019
news_main1555759520.png-25251

500మంది రిక్రూట్‌మెంట్‌
వంద మంది పైలట్లతో సహా 500మంది జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు తమ కంపెనీలో ఉద్యోగాలు కల్పించినట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది. అవసరాన్ని బట్టి మరింత మందిని తీసుకుంటామని భరోసా ఇచ్చింది. త్వరలో మరిన్ని రూట్లలో మరిన్ని విమానాలు నడిపేందుకు రెడీ అవుతున్నందున వీలయినంతమందిని తీసుకుంటామని తెలిపింది. జెట్‌ మూసివేతతో ఏర్పడ్డ కొరతను పూడ్చేందుకు స్పైస్‌జెట్‌ ఇప్పటికే 27 విమానాలను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జెట్‌ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు ప్రధమ ప్రాధాన్యమిస్తున్నట్లు స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ చెప్పారు. తాజాగా తీసుకున్న 500మందిలో 200మంది క్యాబిన్‌సిబ్బంది, 200కుపైగా సాంకేతిక సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. తమకు వీలయినంతమేర మరింత సాయం జెట్‌ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు చేస్తామన్నారు. తాజాగా స్పైస్‌జెట్‌ ముంబై, ఢిల్లీ మధ్య 24 విమానాలు ఆరంభించింది. బిజీ సీజన్‌లో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా తమ శక్తిమేరకు అవసర చర్యలను తీసుకుంటామని అజయ్‌ చెప్పారు. 



You may be interested

విప్రో బైబ్యాక్‌లో పాల్గొంటే పోదూ..!

Sunday 21st April 2019

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో లాభం మార్చి త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ రూ.10,500 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. కానీ, ఇవేవీ కంపెనీ షేరు ధరను పరుగెత్తించలేకపోయాయి. 2008-09 తర్వాత ఆదాయం విషయంలో దారుణ పనితీరు చూపించినది 2018-19లోనే కావడం గమనార్హం. ఆదాయం కేవలం 3.8 శాతమే వృద్ధి సాధించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.3 శాతంగా ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 23శాతం అప్‌

Saturday 20th April 2019

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ. 5,885.12 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. విశ్లేషకుల అంచనా రూ.5,805 కోట్ల కన్నా ఇది ఎక్కువ. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరం క్యు4లో కంపెనీ ఆర్జించిన రూ.4,799.28 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 23శాతం అధికం. సగటు ఆస్తుల వృ‍ద్ధి 19.8శాతం పెరగగా, నికర వడ్డీ

Most from this category