STOCKS

News


కొత్తగా 28 ఫ్లయిట్స్‌

Wednesday 24th April 2019
news_main1556079827.png-25309

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌ విమాన సేవలు నిలిపివేసిన నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థల మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. తాజాగా దేశీయంగా ముంబై, న్యూఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ కొత్తగా 28 ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు స్పైస్‌జెట్ మంగళవారం వెల్లడించింది. ఏప్రిల్‌ 26 నుంచి ఇవి ప్రారంభమవుతాయని పేర్కొంది. ముంబై నుంచి జైపూర్‌, అమృత్‌సర్‌, మంగళూరు, కోయంబత్తూర్‌ రూట్లలో కొత్తగా సర్వీసులు ఉంటాయని స్పైస్‌జెట్ తెలిపింది. అలాగే ముంబై నుంచి హైదరాబాద్‌, పాట్నా, కోల్‌కతా రూట్లలో సర్వీసులు పెంచినట్లు వివరించింది. ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరుకు వెళ్లే విమానాలు టర్మినల్ 2 నుంచి బైల్దేరతాయని స్పైస్‌జెట్ తెలిపింది. మరోవైపు ముంబై నుంచి హాంకాంగ్‌, జెడ్డా, దుబాయ్‌, కొలంబో, ఢాకా, రియాద్‌, బ్యాంకాక్‌, ఖట్మాండులకు మే నెలాఖరు నుంచి నాన్‌-స్టాప్ విమాన సేవలు ప్రారంభించనున్నట్లు సంస్థ చీఫ్ సేల్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు.



You may be interested

రీట్‌, ఇన్విట్‌లకు ఇక డిమాండ్‌!

Wednesday 24th April 2019

కనీస సబ్‌స్క్రిప్షన్‌ను భారీగా తగ్గించిన సెబీ చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌ఈఐటీ/రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఐన్‌వీఐటీ/ఇన్విట్‌)లను మరింత మందికి చేరువ చేసే దిశగా సెబీ నిర్ణయం తీసుకుంది. రీట్‌, ఇన్విట్‌ల ఐపీవో, ఫాలో ఆన్‌ ఆఫర్‌లకు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాలను తగ్గించింది. దీంతో రీట్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ లేదా ఫాలో ఆన్‌ ఆఫర్‌లో ఒక లాట్‌ కనీసం రూ.50,000 విలువకు తక్కువ

చైనాలో ఈ-కామర్స్ సేవలు నిలిపివేయనున్న అమెజాన్‌

Wednesday 24th April 2019

శాన్ ఫ్రాన్సిస్కొ: అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌.. చైనాలో తన ఈ-కామర్స్ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అక్కడి ప్రాంతీయ మార్కెట్లో బలపడిపోయిన ఆలీబాబా, జేడీ డాట్‌ కాం, పిన్‌డ్యూడ్యూ సంస్థలతో పోటీపడలేక తన 15 ఏళ్ల మార్కెట్‌ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ వాటాలో ఆలీబాబాకు 58.2 శాతం ఉండగా.. ఆ రెండు సంస్థలకు 22 శాతం వరకు వాటా ఉంది. ఈ మూడింటి జోరుతో

Most from this category