STOCKS

News


16 రెట్లు పెరిగిన సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లాభం

Tuesday 16th October 2018
news_main1539665596.png-21187

ముంబై: సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌-సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.70 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.4.3 కోట్ల నికర లాభం వచ్చిందని సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ క్యూ2లో నికర లాభం 16 రెట్లు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.1,817 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,855 కోట్లకు పెరిగిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.57 శాతం నుంచి 4.61 శాతానికి, నికర మొండి బకాయిలు 2.57 శాతం నుంచి 3.16 శాతానికి పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేర్‌ 0.3 శాతం నష్టపోయి రూ.12.60 వద్ద ముగిసింది. 
 



You may be interested

నెట్‌వర్క్‌ 18 మీడియా నష్టాలు రూ.68 కోట్లు

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ:  నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీకి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.68 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.71 కోట్ల నికర నష్టాలొచ్చాయని కంపెనీ తెలిపింది. అయితే అంతకుముందటి క్వార్టర్లో (ఈ సంవత్సరం క్యూ1లో) రూ.113 కోట్ల నష్టాలు వచ్చాయని, దీంతో పోలిస్తే ఈ క్యూ2లో నష్టాలు తగ్గాయని నెట్‌వర్క్‌ 18 చైర్మన్‌ అదిల్‌

టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ మొత్తం ఆదాయం రూ.1,202 కోట్లు

Tuesday 16th October 2018

 న్యూఢిల్లీ: మీడియా కంపెనీ, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.40 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.7.3 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 తెలిపింది. గత క్యూ2లో రూ.235 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,202 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వయాకామ్‌ 18 మీడియా, ఇండియాకాస్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ఈ ఏడాది మార్చి

Most from this category