STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాల వివరాలు

Thursday 31st January 2019
news_main1548918693.png-23924

  • ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం 25% అప్‌

ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం డిసెంబర్‌ క్వార్టర్లో 25.5 శాతం వృద్ధి చెంది రూ.596 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదేకాలానికి కంపెనీ లాభం రూ.475 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ3లో ఆదాయం రూ.4,439 కోట్లు కాగా, వడ్డీ ఆదాయం రూ.4,414 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో తెలియజేసింది. వ్యయం రూ.2,908 కోట్ల నుంచి ఈసారి రూ.3,579 కోట్లకు పెరిగినట్లు తెలిపింది.

  • ఎన్‌టీపీసీ నికర లాభం రూ.2,385 కోట్లు

ప్రభుత్వ రంగ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికానికి (క్యూ3, అక్టోబర్‌-డిసెంబర్‌) రూ.2,385 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదేకాలంలో రూ.2,361 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసిన సంస్థ.. అధిక ఇంధన వ్యయం, పెరిగిన రుణ భారం కారణంగా ఈ క్యూ3లో లాభాలు ఫ్లాట్‌గా ఉన్నాయని వివరించింది. నికర ఆదాయం 15.27 శాతం వృద్ధితో రూ.24,308 కోట్లకు చేరుకుంది. ఫలితాల సందర్భంగా బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్లు.. ప్రతి షేరుకు (రూ.10 ముఖవిలువ) 35.8 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించారు. ప్రతి 5 షేర్లకు ఒక బోనస్‌ షేరును ప్రతిపాదించారు.

  • బజాజ్‌ ఆటో లాభం 20% అప్‌..

న్యూఢిల్లీ: అమ్మకాల్లో వృద్ధితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బజాజ్ ఆటో నికర లాభం 20 శాతం పెరిగి రూ. 1,221 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ నికర లాభం రూ. 1,014 కోట్లు. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధి చెంది రూ. 6,595 కోట్ల నుంచి రూ. 7,879 కోట్లకు చేరింది. వాహన విక్రయాలు 26 శాతం వృద్ధితో 10.01 లక్షల నుంచి 12.60 లక్షల యూనిట్లకు చేరాయి. దేశీయంగా మోటార్‌ సైకిల్స్ అమ్మకాలు 4,66,431 నుంచి 6,44,093 యూనిట్లకు పెరిగాయి.

  • స్వల్పంగా పెరిగిన ‘హెక్సావేర్‌’ లాభం

న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ నికర లాభం డిసెంబర్‌ త్రైమాసికంలో 2 శాతం పెరిగి, రూ.123.4 కోట్లుగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ మొత్తం రూ.120.9 కోట్లు. ఇక ఆదాయాలు 24.6 శాతం వృద్ధితో రూ.1,004.8 కోట్ల నుంచి రూ.1,252.4 కోట్లకు పెరిగాయి. కంపెనీ జనవరి-డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా భావిస్తోంది. ఈ ప్రాతిపదికన మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 16.8 శాతం పెరిగి రూ.583.5 కోట్లకు చేరింది. కాగా డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ షేర్‌కు రూ.2.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

  • హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం రూ.20 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ రూ.20.10 కోట్ల నికర లాభాన్ని (పీఏటీ) ఆర్జించింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ.16.76 కోట్లుగా ఉంది. 31 శాతం వృద్ధి నమోదయింది. ఇక, ఆదాయం 2018క్యూ3లో రూ.578.93 కోట్లుగా ఉండగా... 2019 క్యూ3 నాటికి 6.9 శాతం వృద్ధితో రూ.618.76 కోట్లకు చేరింది.

  • భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ ఆకర్షణీయ ఫలితాలు

హైదరాబాద్‌: మైక్రో ఫైనాన్స్‌ రంగంలోని భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ కంపెనీ డిసెంబర్‌ త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం వృద్ధితో రూ.288 కోట్లకు చేరింది. ఆదాయం రూ.893 కోట్లుగా ఉంది. స్థూల ఎన్‌పీఏలు 0.6 శాతంగా, నికర ఎన్‌పీఏలు 0.2 శాతంగా ఉన్నాయి. స్థూల రుణ పోర్ట్‌ఫోలియో 45 శాతం పెరిగి రూ.16,651 కోట్లుగా ఉంది. కంపెనీ నెట్‌వర్త్‌ రూ.3,903 కోట్లుగా, క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 36.2 శాతంగా ఉన్నట్టు సంస్థ తెలిపింది.



You may be interested

గరిష్టస్థాయి నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ క్షీణత

Thursday 31st January 2019

 ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రితం రోజు వెల్లడించిన ఫలితాలు...మార్కెట్‌ అంచనాల్ని చేరకపోవడం, ఆ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందాకొచ్చార్‌పై బ్యాంకు చర్యలు తీసుకోవడం వంటి అంశాల నేపథ్యంలో గురువారం ఈ కౌంటర్లో గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు వెల్లువెత్తాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం జంప్‌చేసి రూ. 376 స్థాయికి చేరిన తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో ఆ స్థాయి నుంచి మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి రూ. 356 స్థాయికి పడిపోయింది.

ఫిలిప్పైన్స్‌లో ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌

Thursday 31st January 2019

5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతాం ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సీఓఓ అభినవ్‌ సిన్హా న్యూఢిల్లీ: ఆతిధ్య రంగ దిగ్గజం ఓయో.. ఫిలిప్పైన్స్‌ దేశంలో ప్రవేశించింది. ఆ దేశంలో కార్యకలాపాల కోసం 21 ఫ్రాంచైజ్‌డ్‌, లీజ్‌డ్‌ హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయో తెలిపింది. ప్రస్తుతం తాము భారత్‌తో పాటు చైనా, మలేషియా, నేపాల్‌, ఇంగ్లాండ్‌, యూఏఈ, ఇండోనేషియా... మొత్తం ఏడు దేశాల్లో  కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సీఓఓ

Most from this category