STOCKS

News


26 రెట్లు పెరిగిన డీఎల్‌ఎఫ్‌ లాభం

Friday 2nd November 2018
Markets_main1541143424.png-21664

రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 26 రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.14 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.375 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అనుబంధ కంపెనీల, జాయింట్‌ వెంచర్ల కార్యకలాపాల ద్వారా రూ.239 కోట్ల లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,751 కోట్ల నుంచి రూ.2,305 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గుర్గావ్‌లో కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం అమెరికాకు చెందిన హైన్స్‌ ఫండ్‌తో కలిసి ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. బకాయిల పరిష్కారం నిమిత్తం రూ.6,500 కోట్ల విలువైన ఆస్తులను డీఎల్‌ఎఫ్‌ సైబర్‌ సిటీ డెవలపర్స్‌కు బదిలీ చేయనున్నామని పేర్కొంది.

తగ్గిన తాజ్‌ జీవీకే లాభం

సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లాభం తగ్గింది. గత ఆర్ధిక సంవత్సరం కన్సాలిడేషన్‌ ఫలితాల్లో రూ.4.23 కోట్ల లాభాన్ని (పన్ను తర్వాత) చవిచూసిన తాజ్‌ జీవీకే.. ఈ ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి రూ.1.28 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.71.68 కోట్లు కాగా.. గతంలో ఇది రూ.122.69 కోట్లుగా ఉంది.

66 శాతం తగ్గిన లారస్‌ లాభం

ఔషధ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 66.7 శాతం తగ్గి రూ.16.2 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.545 కోట్ల నుంచి రూ.599 కోట్లకు ఎగసింది.

తాన్లా లాభం రూ.8.4 కోట్లు

సెప్టెంబరు త్రైమాసికంలో తాన్లా సొల్యూషన్స్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం పెరిగి రూ.8.4 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.198 కోట్ల నుంచి రూ.220 కోట్లకు చేరింది.

 అరవింద్‌ లాభం 16శాతం అప్‌

టెక్స్‌టైల్స్‌, దుస్తుల కంపెనీ అరవింద్‌ ఈ ​‍ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.75 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ2లో వచ్చిన నికర లాభం రూ.65 కోట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి సాధించామని అరవింద్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,609 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.1,816 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,540 కోట్ల నుంచి 12 శాతం వృద్ధి చెంది రూ.1,723  కోట్లకు ఎగిశాయి. ఎబిటా రూ.182 కోట్లు పెరగ్గా, మార్జిన్‌ 10.2 శాతంగా నమోదయింది. బ్రాండెడ్‌ దుస్తులు, ఇంజినీరింగ్‌ వ్యాపారాలను వేరే కంపెనీలుగా విడగొట్టటానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గతంలోనే ఆమోదం తెలిపిందని కంపెనీ గుర్తుచేసింది. కంపెనీల డీమెర్జర్‌ ఈ నెల చివరి వారంలో ఉండొచ్చని, షేర్ల అలాట్‌మెంట్‌కు రికార్డ్‌ డేట్‌ కూడా అప్పుడే ఉండొచ్చని వివరించింది. 



You may be interested

పీఎన్‌బీ ఎన్‌పీఏల షాక్‌..!

Friday 2nd November 2018

క్యూ2లో రూ.4532 కోట్లు నికర నష్టం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కష్టాలు ఇంకా తీరలేదు. పెరిగిన ఎన్‌పీఏలతో పీఎన్‌బీ ఈ క్యూ2లో రూ.4,532కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఈ త్రైమాసికంలో రూ.1,349.2 నికరనష్టాన్ని నమోదు చేయవచ్చని అంచనావేశారు.  గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.560 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం. ఈ క్యూ2 కాలంలో ప్రోవిజన్స్‌ గణనీయంగా పెరిగాయి. గతేడాది ఇదే క్యూ2లో ప్రోవిజన్స్‌

మార్కెట్‌ ర్యాలీకి 5 కారణాలు

Friday 2nd November 2018

- ఇంట్రాడేలో 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ - 10,584 పాయింట్లకు చేరిన నిఫ్టీ - 1.80 శాతం మేర లాభాలు ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌లో శుక్రవారం బుల్‌ రంకెలు వేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు మించి లాభాలను నమోదుచేసింది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయానికి సెన్సెక్స్‌ 601 పాయింట్లు (1.72 శాతం) లాభంతో 35,032 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ 182 పాయింట్లు (1.76 శాతం)

Most from this category