STOCKS

News


కొన్ని ప్రధాన కార్పోరేట్‌ కంపెనీల క్యూ2 ఫలితాలు

Saturday 3rd November 2018
Markets_main1541231306.png-21685

హిందాల్కో లాభం రూ.725 కోట్లు

హిందాల్కో నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 54 శాతం పెరిగి రూ.725 కోట్లకు పెరిగింది. నిర్వహణ సామర్థ్యం బాగాఉండటం, మంచి రియలైజేషన్లు, తక్కువ వడ్డీ వ్యయాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హిందాల్కో తెలిపింది. ఆదాయం 5 శాతం పెరిగి రూ.10,833 కోట్లకు చేరిందని పేర్కొంది. నిర్వహణ ఆదాయం 5 శాతం పెరిగి రూ.1,922 కోట్లకు పెరిగిందని తెలిపింది. నిర్వహణ మార్జిన్‌ 18 శాతంగా ఉందని వివరించింది. అయితే స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం 21 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.393  కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.309 కోట్లకు పడిపోయింది.

ఎన్‌టీపీసీ లాభం రూ.2,426 కోట్లు

ఎన్‌టీపీసీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో స్వల్పంగా తగ్గింది. గత క్యూ2లో రూ.2,439 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,426 కోట్లకు తగ్గిందని ఎన్‌టీపీసీ తెలిపింది. టర్నోవర్‌ 13 శాతం పెరిగి రూ.22,486 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు 18 శాతం పెరిగి రూ.19,851 కోట్లకు చేరాయని వివరించింది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌) 60.67 శాతం నుంచి 75.29 శాతానికి పెరిగిందని ఎన్‌టీపీసీ తెలిపింది.

బాట ఇండియా లాభం రూ.56 కోట్లు
రూ.688 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: పాదరక్షల కంపెనీ, బాటా ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 30 శాతం పెరిగింది. గత క్యూ​2లో రూ.43 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.56 కోట్లకు పెరిగిందని బాటా ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.602 కోట్ల నుంచి రూ.688 కోట్లకు ఎగసిందని బాటా ఇండియా సీఈఓ సందీప్‌ కటారియా తెలియజేశారు. వివిధ కేటగిరీల్లో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం వల్ల ఈ క్యూ2లో మంచి వృద్ధి సాధించామని వివరించారు. పండుగల సీజన్‌ కారణంగా ఈ వృద్ధి జోరు మరింతగా కొనసాగగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

బీఎస్‌ఈ లాభం 31 శాతం డౌన్‌
మొత్తం ఆదాయం రూ.169 కోట్లకు  న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ బీఎస్‌ఈ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ సెప్టెంబర్‌ క్వార్టర్లో 31 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.69 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.46 కోట్లకు తగ్గిందని బీఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ ఆశీష్‌ కుమార్‌ చౌహాన్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.169 కోట్ల నుంచి రూ.164 కోట్లకు పడిపోయిందన్నారు. స్డాండ్అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం 16 శాతం తగ్గి రూ.53 కోట్లకు, మొత్తం ఆదాయం 1 శాతం తగ్గి రూ.152 కోట్లకు చేరాయి. గత నెల 1 నుంచి కమోడిటీ డెరివేటివ్స్‌ ఎక్స్చేంజ్‌ను ‍ఆరంభించామని, పుత్తడి, వెండి ఫ్యూచర్‌ కాంట్రాక్టులను అందుబాటులోకి తెచ్చామని చౌహాన్‌ తెలిపారు. కొత్త విద్యుత్‌ ఎక్స్చేంజ్‌ను ఆరంభించడం కోసం కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్‌కు (సెర్క్‌) దరఖాస్తు చేశామన్నారు. పీటీసీ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో కలిసి సెర్క్‌కు దరఖాస్తు చేశామని తెలియజేశారు. 

వర్ల్‌పూల్‌ ఆదాయం రూ.1,221 కోట్లు
న్యూఢిల్లీ: గృహోపకరణాల కంపెనీ వర్ల్‌పూల్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,221 కోట్ల మొత్తం ఆదాయం సాధించింది. గత క్యూ2లో మొత్తం ఆదాయం రూ.1,187 కోట్లుగా ఉందని, 2 శాతం వృద్ధి సాధించామని వర్ల్‌పూల్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. నికర లాభం రూ.73 కోట్ల నుంచి 7 శాతం పెరిగి రూ.79 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ సునీల్‌ డిసౌజా తెలిపారు. రూపాయి పతనం, ఇంధన ధరలు పెరగడం, కస్టమ్స్‌ సుంకం పెంపు వంటి కారణాల వల్ల ఉత్పత్తుల ధరలను 5-10 శాతం పెంచక తప్పలేదన్నారు. నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా అరవింద్‌ ఉప్పల్‌ను నియమించామని, ఆయన నియామకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇలిక పీబీ కంపెనీలో 49 శాతం వాటాను కొనుగోలు చేశామని తెలిపారు.

న్యూలాండ్‌ లాభం రూ.4.4 కోట్లు
సెప్టెంబరు త్రైమాసికంలో న్యూలాండ్‌ ల్యాబొరేటరీస్‌ నికరలాభం రూ.2.4 కోట్ల నుంచి రూ.4.4 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.130 కోట్ల నుంచి రూ.169 కోట్లను నమోదు చేసింది.



You may be interested

నిబంధనలను అతిక్రమించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్స్‌

Saturday 3rd November 2018

ముంబై: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌... ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కినట్టు కొత్త బోర్డు పరిశీలనలో వెలుగు చూసింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, గ్రూపులోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు 2017-18తో ముగిసిన చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆర్‌బీఐ అనుమతించిన పరిమితుల కంటే ఎక్కువ ఉ‍న్నట్టు వెల్లడైంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య ఏర్పడడంతో, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేకంగా లిక్విడిటీ విండో ప్రారంభించాలని కేంద్రం చేసిన

రూ.813లు కోట్లు కట్టండి.

Saturday 3rd November 2018

సత్యం రామలింగరాజు తదితరులకు సెబీ తాజా ఆదేశాలు న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ. 813 కోట్లు కట్టాలంటూ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు తదితరులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. అలాగే 14 ఏళ్ల పాటు వారు సెక్యురిటీస్ మార్కెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా నిషేధం విధించింది. సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ సూచనల ప్రకారం సెబీ ఈ మేరకు కొత్తగా మళ్లీ ఆదేశాలు జారీ

Most from this category