కొన్ని ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాలు
By Sakshi

78 శాతం పెరిగిన ఎన్ఎండీసీ లాభం మోల్డ్‌టెక్ లాభం రూ.8 కోట్లు సిగ్నిటీ లాభం అప్ సగానికి తగ్గిన లారస్ లాభం దేనా బ్యాంక్ నష్టాలు రూ.178 కోట్లు పవర్‌గ్రిడ్ నికర లాభం రూ.2,331 కోట్లు ఇండియాబుల్స్ హౌసింగ్ లాభం రూ.985 కోట్లు డాబర్ ఇండియా లాభం 10% అప్ 5 శాతం తగ్గిన హీరో లాభం న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సంర మూడో త్రైమాసిక కాలంలో 5 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.805 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.769 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్ తెలిపింది.మొత్తం ఆదాయం రూ.7,424 కోట్ల నుంచి రూ.8,052 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ డిసెంబరు త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. స్టాండలోన్ లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 78 శాతం పెరిగి రూ.1,577 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.2,580 కోట్ల నుంచి రూ.3,785 కోట్లకు ఎగసింది. ఇక గతేడాది ఏప్రిల్-డిసెంబరు కాలానికి రూ.8,901 కోట్ల టర్నోవర్‌పై రూ.3,188 కోట్ల నికరలాభం ఆర్జించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ నికర లాభం 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్యూ3 స్టాండలోన్ ఫలితాల్లో రూ.8.65 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయానికిది రూ.7.74 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.83.66 కోట్ల నుంచి రూ.96.31 కోట్లకు పెరిగింది.
హైదరాబాద్: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సిగ్నిటీ టెక్నాలజీస్ నికర లాభం 7.75 కోట్లను నమోదు చేసింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలానికిది రూ.2.26 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 2018 క్యూ3లో రూ.64 కోట్లు కాగా.. గతేడాది రూ.54.92 కోట్లుగా ఉంది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో లారస్ ల్యాబ్స్ నికర లాభం సగానికి తగ్గింది. క్యూ3 స్టాండలోన్ ఫలితాల్లో పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ.17.48 కోట్లను ఆర్జించింది. అయితే గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలానికి పీఏటీ రూ.35.89 కోట్లను నమోదు చేసింది. 51.29 శాతం క్షీణించింది. ఎబిటా 9.68 శాతం క్షీణతతో రూ.96.42 కోట్ల నుంచి రూ.87.09 కోట్లకు తగ్గింది. ఇక, మొత్తం ఆదాయం మాత్రం రూ.483 కోట్ల నుంచి రూ.514 కోట్లకు పెరిగింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్.. మూడో త్రైమాసికంలో రూ.178.47 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ3లో నమోదైన రూ.380 కోట్ల నష్టంతో పోల్చితే ఈసారి నికర నష్టం తగ్గింది. ఆదాయం సైతం రూ.2,476 కోట్ల నుంచి రూ.2,293 కోట్లకు క్షీణించింది. ఇక స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 19.56 శాతం నుంచి మొత్తం రుణాల్లో 19.77 శాతానికి స్వల్పంగా పెరిగాయి. నికర ఎన్పీఏలు మాత్రం 11.52 శాతం నుంచి 10.44 శాతానికి దిగొచ్చాయి.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నికర లాభం (స్డాండ్‌అలోన్) రూ.2,331 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ3లో ఆర్జించిన రూ.2,041 కోట్లతో పోల్చితే నికర లాభం 14.2 శాతం ఎగసింది. అంతక్రితం ఇదేకాలంలో రూ.7,785 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. ఈ క్యూ3లో 14.19 శాతం పెరిగి రూ.8,890 కోట్లకు చేరిందని పవర్ గ్రిడ్ తెలిపింది.
ముంబై: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్) నికర లాభం 16 శాతం తగ్గి రూ.985.51 కోట్లుగా నమోదైంది. ఇందుకు గతేడాది క్యూ3లో అధిక లాభం రావడం (అధిక బేస్) ప్రధాన కారణమని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడించింది. గతేడాది క్యూ3లో ఓక్ నార్త్ బ్యాంక్‌లోని మూడింట ఒకవంతు వాటాను సింగపూర్‌కు చెందిన జీఐసీకి విక్రయించిన కారణంగా రూ.542 కోట్ల ఏకీకృత లాభం వచ్చిందని వివరించింది. ఇక మొత్తం ఆదాయం 23 శాతం పెరిగి రూ.4,480 కోట్లుగా నమోదైంది.
న్యూఢిల్లీ: దేశీయ ఎంఎఫ్‌సీజీ రంగ సంస్థ డాబర్ ఇండియా గురువారం ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)లో రూ.367 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నమోదుచేసిన రూ.333 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. కంపెనీ ఆదాయం 12 శాతం వృద్ధి చెంది రూ.2,274.46 కోట్లకు చేరుకుంది. ఇక ఏప్రిల్ ఒకటి నుంచి నూతన సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న మోహిత్ మల్హోత్రా నియమకానికి బోర్డు సభ్యులు ఆమోదముద్ర వేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.
You may be interested
ఫిబ్రవరి 28న వ్యక్తిగతంగా హాజరవ్వండి
Friday 1st February 2019సహారా చీఫ్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్, ఇతర డైరెక్టర్లు ఫిబ్రవరి 28వ తేదీన అత్యున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ మేరకు గురువారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సహారాకు సంబంధించి రెండు అనుబంధ సంస్థలు- డిపాజిటర్ల నుంచి నిబంధలను వ్యతిరేకంగా నిధుల సమీకరణ, వీటి పునఃచెల్లింపుల్లో వైఫల్యం కేసు సుప్రీంకోర్టు ముందు ఉన్న సంగతి
యస్ బ్యాంక్ తాత్కాలిక సీఈవోగా అజయ్ కుమార్
Friday 1st February 2019- పదవి నుంచి వైదొలగిన రాణా కపూర్ ముంబై: ప్రైవేటు రంగానికి చెందిన యస్ బ్యాంక్.. ఆ బ్యాంకులో నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా బాధ్యతలు కొనసాగిస్తున్న అజయ్ కుమార్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించింది. ఈయన ఫిబ్రవరి 1 నుంచి దాదాపు నెలరోజులపాటు ఈ పదవిలో కొనసాగుతారని బ్యాంక్ గురువారం ప్రకటించింది. జనవరి 31తో ఎండీ, సీఈఓగా రాణా కపూర్ పదవీకాలం ముగియడం.. మార్చి ఒకటి నుంచి రవ్నీత్ సింగ్ గిల్ ఈ