STOCKS

News


అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు

Wednesday 6th February 2019
news_main1549431343.png-24045

  • హెచ్‌పీసీఎల్‌కు ‘ఇన్వెంటరీ’ నష్టాలు

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 87 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.1,950 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.248 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్‌ తెలిపింది. ఇన్వెంటరీ నష్టాలు భారీగా ఉండటం, రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం భారీగా తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్‌ కె సురానా తెలిపారు.  నికర అమ్మకాలు రూ.62,832 కోట్ల నుంచి రూ.76,884 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇంధన అమ్మకాలు 2.5 శాతం వృద్ధితో 9.4 మిలియన్‌ టన్నులకు పెరిగాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.6.50 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.
రూ.3,465 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు
గత క్యూ3లో రూ.1,477 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, ఈ క్యూ3లో రూ.3,465 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల వచ్చే స్థూల రిఫైనరీ మార్జిన్‌ గత క్యూ3లో 9.04 డాలర్లుగా ఉండగా, ఈ క్యూ3లో 3.72 డాలర్లుగా నమోదయిందని పేర్కొన్నారు. ఇంధన నష్టాలు 7.5 శాతంగా ఉన్నాయని వివరించారు.

ఓయో నికర నష్టం రూ.360 కోట్లు
న్యూఢిల్లీ: ఆతిథ్య సేవల సంస్థ ఓయో 2017-18 ఆర్థిక సంవత్సరానికి నికర నష్టం రూ.360 కోట్లుగా ప్రకటించింది. అంతక్రితం ఏడాది నష్టం రూ.355 కోట్ల నికర నష్టాన్ని సంస్థ ప్రకటించింది. 2016-17 కాలానికి నికర ఆదాయం రూ.120 కోట్లు కాగా, 2017-18లో మొత్తం ఆదాయం మూడు రెట్లు వృద్ధి చెంది రూ.416 కోట్లుగా నమోదైంది. సాంకేతిక పరిజ్ఞానం, బృందాల ఏర్పాటుకు వ్యయం పెంచడం... కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం వల్ల ఆదాయంలో వృద్ధి చోటుచేసుకున్నప్పటికీ.. నష్టాలు పెరగడానికి కారణమని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సీఎఫ్‌ఓ అభిషేక్ గుప్తా వివరించారు. 2018-19 ఆదాయ అంచనా రూ.1,400 కోట్లుగా తెలియజేశారు.

సీఈఎస్‌సీ డివిడెండ్‌ ఒక్కో షేర్‌కు రూ.17.5
కోల్‌కత: ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, సీఈఎస్‌సీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికంలో 13 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.153 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.173 కోట్లకు పెరిగిందని సీఈఎస్‌సీ తెలిపింది. ఆదాయం రూ.1,713 కోట్ల నుంచి రూ.1,707 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.17.5 చొప్పున మద్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.280 కోట్లు అవుతాయని పేర్కొంది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో విద్యుత్‌​ప్రసార బిడ్‌ను దక్కించుకున్నామని, త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొంది.

27 శాతం తగ్గిన సువెన్‌ లాభం
హైదరాబాద్‌ బిజినెస్‌ బ్యూరో: డిసెంబరు త్రైమాసికంలో సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 27 శాతం తగ్గి రూ.25 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.167 కోట్ల నుంచి రూ.135 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.430 కోట్ల టర్నోవరుపై రూ.82 కోట్ల నికరలాభం పొందింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.50 మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది.

డీఎల్‌ఎఫ్‌ లాభం 92 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 92 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.4,091 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.335 కోట్ల నికర లాభం వచ్చిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. గత క్యూ3లో తమ అద్దె విభాగం, డీఎల‍్ఎఫ్‌ సైబర్‌ సిటీ డెవలర్స్‌ను  జీఐసీ సంస్థకు విక్రయించడం వల్ల రూ.8,569 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని, ఫలితంగా  గత క్యూ3లో  నికర లాభం బాగా పెరిగిందని వివరించింది. గత క్యూ3లో రూ.1,885 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,406 కోట్లకు చేరిందని పేర్కొంది.

గెయిల్‌ లాభం రూ.1,681 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గెయిల్‌ ఇండియా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,681 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.1,262 కోట్లు)తో పోల్చితే ఇది 33 శాతం అధికమని గెయిల్‌ ఇండియా తెలిపింది. నేచురల్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌, ట్రాన్స్‌మిషన్‌, లిక్విడ్ హైడ్రో కార్బన్‌, ఎల్‌పీజీ ట్రాన్స్‌మిషన్ సెగ్మెంట్లు మంచి పనితీరు కనబరచడం వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించామని గెయిల్‌ సీఎమ్‌డీ బి. సి త్రిపాఠి తెలిపారు. నేచురల్‌ గ్యాస్‌ అమ్మకాలు 9 శాతం, ఎల్‌పీజీ ట్రాన్స్‌పోర్ట్‌ 11 శాతం, లిక్విడ్‌ హైడ్రోకార్బన్‌ అమ్మకాలు 5 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. అయితే నేచురల్‌ గ్యాస్‌​‍ట్రేడింగ్‌, పెట్రోకెమికల్‌ సెగ్మెంట్ల మార్జిన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6.25 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు 70,000 కోట్లుగా ఉండొచ్చని, గత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల కంటే ఇది 70 శాతం అధికమని వివరించారు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,538 కోట్లు
ముంబై: చిన్న సైజు ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌... ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో రూ.1,538 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. క్యాపిటల్‌ ఫస్ట్‌ సంస్థ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లు గత ఏడాది డిసెంబర్‌లోనే విలీనమై ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం తొలి త్రైమాసిక ఫలితాలు ఇవి. ఇటీవలే ఈ విలీన బ్యాంక్‌ ఏర్పడినందున గత క్యూ3 ఫలితాలతో, ఈ క్యూ3 ఫలితాలను పోల్చడానికి లేదు. విలీనం కారణంగా లెక్కింపునకు వీలు కాని గుడ్‌విల్ తదితర అసెట్స్‌కు రూ. 2,600 కోట్ల మేర కేటాయింపులు జరపాల్సి రావడంతో ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఎండీ వి. వైద్యనాథన్ తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ.1,145 కోట్లు సాధించామని, నికర వడ్డీ మార్జిన్‌ 3.27 శాతంగా నమోదైందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 1.97 శాతంగా, నికర మొండి బకాయిలు 0.95 శాతంగా ఉన్నాయని, ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 72.9 శాతంగా నమోదైందని తెలిపారు.

 You may be interested

కార్పోరేట్‌ భ్రీఫ్‌

Wednesday 6th February 2019

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల పెంపు   న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా రుణాలపై వడ్డీ రేట్లను 0.2 శాతం దాకా పెంచింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలు మరింత భారం కానున్నాయి. సవరించిన రేట్లు (ఎంసీఎల్‌ఆర్‌) గురువారం నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. మూడు నెలల వ్యవధికి ఎ౾ంసీఎల్‌ఆర్‌ 8.30 శాతం నుంచి 8.50 శాతానికి, ఆరు నెలల వ్యవధికి 8.5

భెల్‌ లాభం 25శాతం అప్‌

Wednesday 6th February 2019

25 శాతం పెరిగిన భెల్‌ లాభం ఒక్కో షేర్‌కు 80 పైసల మధ్యంతర డివిడెండ్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ, భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్లో 25 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.153 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.192 కోట్లకు పెరిగిందని భెల్‌ తెలిపింది. ఆదాయం రూ.6,666 కోట్ల నుంచి 10 శాతం ఎగసి రూ.7,336 కోట్లకు పెరిగిందని భెల్‌

Most from this category