STOCKS

News


ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాల వివరాలు

Friday 25th January 2019
news_main1548396514.png-23799

  • పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 32 శాతం అప్‌

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో (అక్టోబర్‌-డిసెంబర్‌) 32 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.229 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్వార్టర్‌లో రూ.303 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.2,078 కోట్లకు పెరిగింది. గతేడాది క్యూ3లో నమోదైన రూ.1,416 కోట్లతో పోలిస్తే 46 శాతం వృద్ధి చెందింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.02 నుంచి 3.06 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు 0.42 నుంచి 0.47 శాతానికి పెరగగా, నికర నిరర్థక ఆస్తులు 0.31 నుంచి 0.37 శాతానికి పెరిగినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది.

  • మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ లాభం 177 శాతం జంప్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ మూడవ త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. క్రితం కాలంతో పోలిస్తే ఈ డిసెంబరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం 177 శాతం పెరిగి రూ.3.3 కోట్లు ఆర్జించింది. టర్నోవరు రూ.18 కోట్ల నుంచి రూ.25.6 కోట్లుగా ఉంది. ఎబిటా మార్జిన్‌  16 నుంచి 28 శాతానికి ఎగసింది. ఇక ఏప్రిల్‌- డిసెంబరు మధ్య 9 నెలల కాలానికి చూస్తే రూ.68 కోట్ల టర్నోవరుపై కంపెనీ రూ.8.3 కోట్ల నికరలాభం ఆర్జించింది.

  • బయోకాన్‌ నికర లాభం 136% జూమ్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో (అక్టోబర్‌-డిసెంబర్‌) బయో టెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం రూ.217 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ3లో ఆర్జించిన రూ.92 కోట్లతో పోల్చితే లాభం ఏకంగా 136 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది మూడో త్రైమాసిక నికర అమ్మకాలు రూ.1,541 కోట్లుగా నమోదుకాగా, గతేడాది ఇదేకాలానికి సాధించిన రూ.1,058 కోట్ల అమ్మకాలతో పోల్చితే 46 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ఎబిడిటా 59 శాతం వృద్ధి చెంది రూ.406 కోట్లుగా తేలింది.

  • ఎన్‌ఐఐటీ నికరలాభం 1.5 % తగ్గుదల

న్యూఢిల్లీ: స్కిల్‌, టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో ఉన్న ఎన్‌ఐఐటీ.. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికలో రూ.19.4 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. గతేడాది క్యూ3లో ఆర్జించిన రూ.19.7 కోట్లతో పోల్చితే 1.5 శాతం క్షీణత నమోదయింది. ప్రతికూల విదేశీ మారకం (విదీశీ) ప్రభావం ఇందుకు కారణమని తెలియజేసింది. కాగా ఈ క్వార్టర్లో రూ.228 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. గతేడాది ఇదేకాలంలో నమోదైన రూ.209 కోట్లతో చూస్తే ఆదాయం 8.7 శాతం పెరిగింది.

  • తగ్గిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికర లాభం

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో (అక్టోబర్‌-డిసెంబర్‌) రూ.390 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదేకాలానికి నమోదైన రూ.457 కోట్లతో పోలిస్తే నికర లాభం 14 శాతం క్షీణించింది. ఆదాయం ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.9,493 కోట్లు కాగా, గతేడాది క్యూ3లో నమోదైన రూ.8,057 కోట్లతో చూస్తే ఆదాయం 19 శాతం పెరిగింది. ఏడాది ప్రాతిపదికన దేశీ అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. పెరిగిన ఇంధన వ్యయం, రూపాయి విలువ పడిపోవడం వంటి ప్రతికూల అంశాలతో వ్యయం 11 శాతం పెరిగిందని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో పేర్కొంది. యూఎన్‌సీఎల్‌ సముపార్జన నిమిత్తం తీసుకున్న రుణంపై వడ్డీ భారం పెరగినట్లు తెలిపింది.



You may be interested

ఇండియా వైపు మార్క్‌మొబియస్‌ మొగ్గు

Friday 25th January 2019

ప్రపంచపేరొందిన ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ ఈ ఏడాది పెట్టుబడులకు భారత్‌ బాగుందని సూచిస్తున్నారు. వర్ధమాన మార్కెట్లలో భారత్‌, బ్రెజిల్‌, టర్కీలపై బుల్లిష్‌గా ఉన్నట్లు చెప్పారు. ఈ మార్కెట్లలో ఎంటరయ్యేందుకు ఇదే మంచి తరుణమన్నారు. ఇటీవలే ఇండియాలో పర్యటించానని, అక్కడ వచ్చిన మార్పులు చాలా ఆశ్చర్యాన్నిచ్చాయని తెలిపారు. చాలా వరకు వర్ధమాన మార్కెట్లలో భారీ రికవరీ కనిపిస్తోందని చెప్పారు. గతేడాది ట్రేడ్‌వార్‌, ఫెడ్‌ రేట్ల భయాలతో ఈ మార్కెట్లు నేల చూపులు

ఈ 15 షేర్లూ...బడ్జెట్‌ బెట్స్‌!

Friday 25th January 2019

అనలిస్టుల సూచన మధ్యంతర బడ్జెట్‌తో ప్రయోజనం పొందే 15 స్టాకులను వివిధ బ్రోకరేజ్‌ సంస్థలకు చెందిన అనలిస్టులు సూచిస్తున్నారు. 5నాన్స్‌ డాట్‌కామ్‌ సూచనలు 1. టీవీఎస్‌మోటర్స్‌: వ్యవసాయదారులకు యూబీఐ అమలుతో కంపెనీకి లాంగ్‌టర్మ్‌లో లబ్ది కలుగుతుంది. క్యు3లో కంపెనీ మంచి లాభాలను ప్రకటించింది. నెలవారీ విక్రయాలు కూడా బాగున్నాయి. 2. డాబర్‌ ఇండియా: కంపెనీ ఆదాయాల్లో దాదాపు సగం వాటా గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌దే ఉంది. ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధిపై ఎక్కువ ఫోకస్‌ పెట్టనున్నందున కంపెనీకి

Most from this category