STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాలు

Thursday 14th February 2019
news_main1550126985.png-24196

  • గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ లాభం రెండు రెట్లు

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లకు పైగా పెరిగింది. గత క్యూ3లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.121 కోట్లకు ఎగసిందని గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,169 కోట్ల నుంచి రూ.2,576 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.2,580 కోట్లకు చేరాయని తెలిపింది.

  • భారత్‌ ఫోర్జ్‌ లాభం రూ.310 కోట్లు 

వాహన విడిభాగాలు తయారు చేసే భారత్‌ ఫోర్జ్‌ లాభం ఈ క్యూ3లో 36 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.228 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.310 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,412 కోట్ల నుంచి రూ.1,740 కోట్లకు పెరిగింది. అన్ని విభాగాల్లో మంచి పనితీరు సాధించామని కంపెనీ సీఎమ్‌డీ బి.ఎన్‌. కళ్యాణి పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలు, పారిశ్రామిక రంగాల నుంచి 65 లక్షల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను సాధించామని తెలిపారు. నాలుగో క్వార్టర్‌లో కూడా డిమాండ్‌ జోరు కొనసాగగలదని ఆయన అంచనా వేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అమిత్‌ బి. కళ్యాణి పునః నియామాకాన్ని డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని, ఈ ఏడాది మే 11 నుంచి ఐదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. 

  • టేక్‌ సొల్యూషన్స్‌ డివిడెండ్‌ 30 పైసలు 

చెన్నై: జీవ శాస్త్ర, సరఫరా చెయిన్‌  మేనేజ్‌మెంట్‌ కంపెనీ టేక్‌ సొల్యూషన్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో రూ.36 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ3లో రూ.42 కోట్ల నికర లాభం వచ్చిందని వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.409 కోట్ల నుంచి రూ.524 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  ఒక్కో షేర్‌కు 30 పైసలు (30 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. 
తొమ్మిది నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే,  నికర లాభం రూ.114 కోట్ల నుంచి రూ.151 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.1,137 కోట్ల నుంచి రూ.1,529 కోట్లకు పెరిగాయని  తెలిపింది.

 

  • అదానీ ట్రాన్సిమిషన్‌ లాభం రూ.189 కోట్లు 

న్యూఢిల్లీ: అదానీ ట్రాన్సిమిషన్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.189 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ3లో రూ.842 కోట్ల నికర లాభం వచ్చిందని అదానీ ట్రాన్స్‌మిషన్‌ పేర్కొంది. రూ.742 కోట్ల వన్‌-టైమ్‌ ఇన్‌కమ్‌ కారణంగా ఈ స్థాయిలో గత క్యూ3లో లాభం సాధించామని వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకుకంటే గత క్యూ3లో రూ. 100 కోట్ల లాభమే వచ్చినట్లవుతుందని తెలిపింది. గత క్యూ3లో రూ.1,806 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,921 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 2022 కల్లా అందరికీ విద్యుద్తును అందించాలనేది భారత ప్రభుత్వం లక్ష్యమని, అందుకే తాము కీలకమైన జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటున్నామని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు. 

  • మరింత పెరిగిన సీజీ పవర్‌ నష్టాలు 

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కంపెనీ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.28 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.150 కోట్లకు ఎగిశాయని సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,537 కోట్ల నుంచి రూ.1,731 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నికర నష్టాలు రూ.584 కోట్ల నుంచి రూ.262 కోట్లకు తగ్గాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,569 కోట్ల నుంచి రూ.4,884 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 
 నికర నష్టాలు భారీగా పెరగడంతో ఈ షేర్‌ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.23.5ను తాకిన ఈ షేర్‌ చివరకు 30 శాతం నష్టంతో రూ.23.75 వద్ద ముగిసింది.

  • బాష్‌ లాభం రూ.335 కోట్లు 

న్యూఢిల్లీ: వాహన విడిభాగాలు తయారు చేసే బాష్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.335 కోట్ల నికర లాభం (స్డాండోలోన్‌)సాధించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.281 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని బాష్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,174 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వ్యయాలు రూ.2,784 కోట్లకు చేరాయని తెలిపింది. భాస్కర్‌ భట్‌ను ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా రెండోసారి నియామకానికి  కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. జాయింట్‌ ఎమ్‌డీగా ఆండ్రియాస్‌ ఓల్ఫ్‌ను మళ్లీ డైరెక్టర్ల బోర్డ్‌ నియమించిందని పేర్కొంది. 

   

  •        రుచి సోయా లాభం రూ.6 కోట్లు 

న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న రుచి సోయా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.6 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,960 కోట్ల నికర నష్టాలు వచ్చాయని రుచి సోయా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,050 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ కంపెనీ రుణభారం రూ.12,000 కోట్లుగా ఉంది. న్యూట్రెలా, మహాకోశ్‌, సన్‌రిచ్‌, రుచి స్టార్‌, రుచి గోల్డ్‌ బ్రాండ్ల వంటనూనెలను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్‌, బాబా  రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి కంపెనీలు ఈ కంపెనీ కొనుగోలు రేసులో ఉన్నాయి. 



You may be interested

భారత్‌ ఫోర్జ్‌ డౌన్‌గ్రేడ్‌

Thursday 14th February 2019

2.50శాతం నష్టపోయిన షేరు బ్రోకరేజ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను తగ్గించడంతో ఆటో విడిభాగాల కంపెనీ భారత్‌ ఫోర్జ్‌ షేరు గురువారం 2.50శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.475.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. వచ్చే ఏడాదిలో కమర్షియల్‌ వాహన అమ్మకాలు క్షీణించడంతో కంపెనీ మార్జిన్లు మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో పాటు రాబోయే రోజుల్లో కంపెనీ వృద్ధి అంచనాలు అధికంగా ఉండటంతో షేరు టార్గెట్‌ ధరును తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థలు

ఈ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెరిగింది!

Thursday 14th February 2019

గతేడాది కాలంలో దాదాపు 80 కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నట్లు గణాంకాలు చూపుతున్నాయి. ఈ 80 కంపెనీల స్టాకుల్లో 62 కంపెనీల స్టాకులు ఏడాది కాలంలో సుమారు 80 శాతం పతనమయ్యాయి. కేవలం 18 స్టాకులు మాత్రమే పాజిటివ్‌ రాబడులు చూపాయి. 80 స్టాకుల్లో ఎక్కువ శాతం చిన్న, మధ్యతరహా స్టాకులే ఉన్నాయి. గతేడాది మిడ్‌క్యాప్‌ కరెక‌్షన్‌లో ఈ స్టాకులు బాగా దెబ్బతిన్నాయి. ఎఫ్‌ఐఐలు విచ్చలవిడిగా అమ్మకాలకు దిగడంతో మార్కెట్లో

Most from this category