STOCKS

News


అక్టోబర్‌ - డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు

Saturday 9th February 2019
Markets_main1549699371.png-24108

పెరిగిన నాగార్జున ఫెర్టిలైజర్స్‌ నష్టాలు
డిసెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ రూ.179 కోట్ల నికరనష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.10 కోట్ల నష్టం పొందింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.1,439 కోట్ల టర్నోవరుపై రూ.352 కోట్ల నికరనష్టం చవిచూసింది.

ఎమ్‌ఆర్‌పీఎల్‌ నష్టాలు రూ.268 కోట్లు

  • దెబ్బతీసిన రిఫైనరీ మార్జిన్లు

న్యూఢిల్లీ: మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌(ఎమ్‌ఆర్‌పీఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్లో రూ.268 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. రిఫైనరీ మార్జిన్లు ప్రతికూలంగా ఉండటంతో ఈ క్యూ3లో నికర నష్టాలు వచ్చాయని ఎమ్‌ఆర్‌పీఎల్‌ తెలిపింది. గత క్యూ3లో రూ.970 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది.
రిఫైనరీ మార్జిన్‌ నష్టాలు రూ.148 కోట్లు
గత క్యూ3లో స్థూల రిఫైనరీ మార్జిన్‌ ఒక్కో బ్యారెల్‌కు 9.27 డాలర్లు లాభంగా వచ్చిందని, కానీ ఈ క్యూ3లో 0.64 డాలర్ల నష్టం వచ్చిందని ఎమ్‌ఆర్‌పీఎల్‌ వివరించింది. అంకెల పరంగా చూస్తే, రిఫైనరీ మార్జిన్‌ గత క్యూ3లో 1,973 కోట్లు రాగా ఈ క్యూ3లో రూ.148 కోట్ల నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఈ క్యూ3లో టర్నోవర్‌ 16 శాతం పెరిగి రూ.20,250 కోట్లకు, ఎగుమతులు 54 శాతం పెరిగి రూ.8,852 కోట్లకు చేరాయని తెలిపింది.

19 శాతం తగ్గిన అవంతి లాభం
డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో అవంతి ఫీడ్స్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం తగ్గి రూ.85 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.722 కోట్ల నుంచి రూ.849 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.2,664 కోట్ల టర్నోవరుపై రూ.230 కోట్ల నికరలాభం ఆర్జించింది.

నాల్కో లాభం 58  శాతం డౌన్‌

  • రూ.2,795 కోట్లకు మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: ​ ప్రభుత్వ రంగ కంపెనీ. నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ లిమిటెడ్‌(నాల్కో) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 58 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.722 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.302 కోట్లకు తగ్గిందని నాల్కో తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.2,465 కోట్ల నుంచి రూ.2,795 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ కంపెనీ లోహ, మైనింగ్‌, విద్యుత్తు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీలో ప్రస్తుతానికి ప్రభుత్వానికి ప్రస్తుతం 56.59 శాతం వాటా ఉంది.



You may be interested

పార్లమెంట్‌లో బిజెనెస్‌

Saturday 9th February 2019

విదేశీ కార్యకలాపాల కుదింపు దిశగా బ్యాంకులు విదేశాల్లో తమ బిజినెస్‌ కార్యకలాపాల కుదింపునకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి గుర్తించిన కార్యకలాపాల సంఖ్య జనవరి 15 నాటికి 54గా ఉంది.  ఇందులో 29 కార్యకలాపాలు కేవలం వ్యయ నియంత్రణలో భాగంగా నిలిచిపోతున్నాయి.  మిగిలినవి వ్యాపార వ్యూహం, పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా నిలిచిపోతున్నాయి. బ్యాంకులు పరస్పర సంప్రతింపుల ద్వారా ఈ దిశగా చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. ఆర్థికశాఖ

ప్రయాణికుల వాహన విక్రయాల్లో క్షీణత

Saturday 9th February 2019

జనవరిలో 2,80,125 వాహన అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం తక్కువ న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగంలో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి నెలలోనూ ప్రయాణికుల వాహనాల్లో 2 శాతం క్షీణత నమోదైంది. మొత్తం 2,80,125 వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం సియామ్‌ తెలిపింది. పండుగ సీజన్‌లో అమ్మకాలు ఆశించినంత లేకపోవడంతో నిల్వలను తగ్గించుకోవడంపై తయారీదారులు దృష్టి పెట్టినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జనవరిలో అమ్ముడైన వాహనాలు

Most from this category