STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీలు మూడో త్రైమాసికి ఫలితాలు

Thursday 24th January 2019
news_main1548306653.png-23775

  • విజయా బ్యాంక్ లాభం 80 శాతం అప్‌

న్యూఢిల్లీ:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ విజయా బ్యాంక్ నికర లాభం 80 శాతం ఎగిసి రూ. 143 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ.80 కోట్లు. మరోవైపు తాజా క్యూ3లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.3,451 కోట్ల నుంచి రూ. 4,106 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 6.17 శాతం నుంచి 6.14 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 3.99 శాతం నుంచి 4.08 శాతానికి పెరిగాయి. మొండి బాకీలకు కేటాయింపులు రెట్టింపై రూ.333 కోట్ల నుంచి రూ.582 కోట్లకు ఎగిశాయి. ఏప్రిల్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్ విలీనం కానున్న సంగతి తెలిసిందే.

  • ఆర్‌కామ్ నష్టాలు రూ. 341 కోట్లు

న్యూఢిల్లీ: రుణభారంతో కుంగుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో రూ.341 కోట్ల నష్టం నమోదు చేసింది. రూ.1,091 కోట్ల రుణానికి సంబంధించిన వడ్డీలు, కరెన్సీ మారక క్షీణత కారణంగా తలెత్తిన నష్టాలు ఇందులో పొందుపర్చలేదు. వీటన్నింటిని కూడా చేరిస్తే నష్టం మొత్తం రూ. 617 కోట్లకు పెరిగేదని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నష్టం రూ.206 కోట్లు. రిలయన్స్ రియల్టీ అసెట్స్‌, రుణాలు, అందులో పెట్టుబడులను ఖాతాల నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ ఆర్థిక ఫలితాలను పోల్చి చూడటానికి లేదని ఆర్‌కామ్ పేర్కొంది. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం రూ.1,176 కోట్ల నుంచి రూ.1,083 కోట్లకు తగ్గింది. మరోవైపు, ఆర్‌కామ్ విదేశీ విభాగం జీసీఎక్స్‌ కూడా సంక్షోభంలో కూరుకుపోతోంది. జీసీఎక్స్‌ అసెట్స్‌, రుణభారం మధ్య వ్యత్యాసం 324 మిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. 2019 ఆగస్టులో 350 మిలియన్ డాలర్ల బాండ్లను తిరిగి చెల్లించాల్సి ఉంది.

  • భారతీ ఇన్‌ఫ్రాటెల్ లాభం రూ. 648 కోట్లు

న్యూఢిల్లీ: టెలికం టవర్స్ కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ మూడో త్రైమాసిక నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 648 కోట్లకు చేరింది. ఆదాయం స్వల్ప క్షీణతతో రూ.3,640 కోట్లుగా నమోదైంది. దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్, విలీన దశ ముగిసినట్లేనని భారతీ ఇన్‌ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా తెలిపారు. 4జీ నెట్‌వర్క్‌ను పటిష్టం చేయడంతో పాటు తదుపరి రాబోయే 5జీ సేవల సంబంధిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందుకోసం భారీ పెట్టుబడులు అవసరమవుతాయని, భారీ వృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయని గుప్తా చెప్పారు.You may be interested

ద్వితియార్ధంలో చిన్నస్టాకులదే హవా

Thursday 24th January 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  గతేడాది అధ్వాన్న ప్రదర్శన చూపిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాకులు ఈ ఏడాది గాడిన పడతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌హెడ్‌ దీపక్‌ జసాని అభిప్రాయపడ్డారు. భారత్‌లాంటి పెద్ద దేశంలో అనేక కంపెనీలుంటాయని, వీటిలో చిన్న, మధ్యతరహా కంపెనీల్లో కొన్ని నాణ్యమైనవి ఉంటాయని చెప్పారు. డౌన్‌ట్రెండ్‌ సమయాన ఎంత నాణ్యమైన చిన్నస్టాకైనా పతనమవడం తప్పదని, కానీ మంచి కంపెనీల్లో కరెక‌్షన్‌ చూసి భయపడకూడదని తెలిపారు. లార్జ్‌ క్యాప్స్‌తో పోలిస్తే చిన్నస్టాకులతోనే సంపద

ఆర్థిక వృద్ధి స్పీడ్‌లో భారత్‌ ఫస్ట్‌!

Thursday 24th January 2019

- ఐక్యరాజ్యసమితిసహా పలు బహుళజాతి సంస్థల అంచనా న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థికాభివృద్ధి రేటు 2019- 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సహా పలు ఆర్థిక విశ్లేషణా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఈ రెండు సంవత్సరాల్లో భారత్‌ వృద్ధి రేటు 7 శాతంపైనే ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆయా అంచనాలను క్లుప్లంగా చూస్తే... ‘వినియోగం’ ఇంధనం: ఐక్యరాజ్యసమితి భారత్‌ వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా

Most from this category