News


సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ ఇండియా హెడ్‌గా సుమర్‌ జునేజా

Thursday 22nd November 2018
news_main1542865193.png-22298

న్యూఢిల్లీ: జపాన్‌ దిగ్గజ సంస్థ, సాఫ్ట్‌బ్యాంక్‌ తన విజన్‌ ఫండ్‌ భారత అధినేతగా సమర్‌ జునేజాను నియమించింది.  భారత్‌లో విజన్‌ ఫండ్‌ కార్యకలాపాలను జునేజా నిర్వహిస్తారని సాఫ్ట్‌బ్యాంక్‌ వెల్లడించింది. సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ ద్వారా వివిధ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఈ ఫండ్‌ ఇప్పటికే భారత్‌కు చెందిన నాలుగు పెద్ద స్టార్టప్‌ల్లో 500 కోట్ల డాలర్ల వరకూ ఇన్వెస్ట్‌ చేసింది. ఓయో, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎమ్‌, పాలసీబజార్‌ సంస్థల్లో విజన్‌ ఫండ్‌ పెట్టుబడులున్నాయి. ఈ ఏడాది మొదట్లో ప్లిప్‌కార్ట్‌లో వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించి, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి వైదొలగింది కూడా. సమర్‌ జునేజా నార్వెస్ట్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ సంస్థలో పనిచేస్తున్నారు. స్విగ్గీ, క్వికర్‌, కోమ్లి మీడియా తదితర సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసిన అనుభవం ఆయనకుంది.



You may be interested

ఐవీఆర్‌సీఎల్‌ దివాలా ప్రక్రియ గడువు 7 రోజుల పెంపు

Thursday 22nd November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:  హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్నున్న మౌలిక రంగ సంస్థ- ఐవీఆర్‌సీఎల్‌ దివాలా ప్రక్రియ (సీఐపీఆర్‌- కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌) గడువును నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, హైదరాబాద్‌ బెంచ్‌ ఏడు రోజులు పొడిగించింది. దీనితో ఈ నెల 27 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. వివరాల్లోకి వెళితే, దివాలా ప్రక్రియకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ

రెండేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయం

Thursday 22nd November 2018

ముంబై: ఆన్‌లైన్‌ ఫార్మసీ రిటైల్‌ సంస్థ, మెడ్‌లైఫ్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.830 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల ఆదాయం వచ్చిందని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తుషార్‌ కుమార్‌ పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో  ఈ-ఫార్మసీ వ్యాపారం వాటా 80 శాతంగా ఉందని, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 65-70 శాతానికి తగ్గుతుందన్న అంచనాలున్నాయని చెప్పారు. రెండేళ్లలో రూ.700 కోట్ల పెట్టుబడులు... రానున్న రెండేళ్లలో రూ.3,000

Most from this category