STOCKS

News


రూ.1,400 కోట్లు సమీకరించిన గ్రోఫర్స్‌

Thursday 16th May 2019
news_main1557992162.png-25772

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గ్రోసరీ రిటైల్‌ సంస్థ గ్రోఫర్స్‌... సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ తదితర ఇన్వెస్టర్ల నుంచి 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు) సమీకరించింది. సిరీస్‌ ఎఫ్‌ కింద జరిగిన ఈ నిధుల సమీకరణలో కొత్త ఇన్వెస్టర్‌ కేటీబీతోపాటు ప్రస్తుత వాటాదారులైన టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, సీక్వోయ క్యాపిటల్‌ పెట్టుబడులు పెట్టినట్టు గ్రోఫర్స్‌ ప్రకటించింది. ఈ నిధులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించాలని భావిస్తున్నట్లు, తద్వారా కోట్లాది భారతీయ వినియోగదారులకు చేరువ కావాలనుకుంటున్నట్టు తెలిపింది. ‘‘ఎక్కువ మంది దళారీల వల్ల గ్రోసరీలను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం చాలామందికి లేదు. అలాంటి లక్షలాది వినియోగదారుల కోసం గ్రోఫర్స్‌ను నిర్మించాం. నాణ్యమైన ఉత్పత్తులను, చక్కని ధరలకు వినియోగదారులు సొంతం చేసుకునేందుకు మా తాజా నిధుల సమీకరణ దోహదపడుతుంది’’ అని గ్రోఫర్స్‌ సీఈవో అల్బిందర్‌ దిండ్సా పేర్కొన్నారు.  బిగ్‌ బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తదితర సంస్థలు గ్రోఫర్స్‌కు పోటీ సంస్థలుగా ఉన్నాయి. You may be interested

రైట్స్‌లో 15 శాతం వాటా విక్రయం !

Thursday 16th May 2019

ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానానికి మొగ్గు రూ.700 కోట్లు సమీకరిస్తుందని అంచనా న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన రైట్స్‌ కంపెనీలో 15 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాటా షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.700 కోట్లు రాగలవని అంచనా. ఈ ఓఎఫ్‌ఎస్‌కు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి దీపమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌  అసెట్‌ మేనేజ్‌మెంట్‌) ఇటీవలే ఆసక్తి గల సంస్థల

ఈ స్టాకుల పీఈ పెరిగింది.. అమ్మేయాలా?

Thursday 16th May 2019

ఇటీవల కాలంలో సూచీలపై కరెక‌్షన్‌ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ప్రధాన సూచీలు తమ ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి దాదాపు 5,6 శాతం దిగువకు పతనమైనాయి. కానీ నిఫ్టీలోని 22 స్టాకులు మాత్రం ఇప్పటికీ తమ పదేళ్ల పీఈ సరాసరి కన్నా ప్రీమియంతోనే ట్రేడవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. స్టాక్‌ ధర వాల్యూషన్‌ను పీఈ ఆధారంగా మదింపు చేస్తారు. పీఈ అధికంగా ఉంటే వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కిస్తారు. ఇలా అధిక వాల్యూషన్‌

Most from this category