STOCKS

News


జియోలో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు

Wednesday 24th April 2019
news_main1556077909.png-25303


- 2-3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం
- విలువ మదింపు ప్రక్రియలో సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్ ఫండ్‌
- జియో విలువ 50 బిలియన్ డాలర్లుగా జేపీ మోర్గాన్ అంచనాలు

న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు 2–3 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. వాటాల విక్రయం ద్వారా వ్యాపార సామ్రాజ్య రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘జియోలో సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేయొచ్చంటూ చాలా రోజులుగా అంచనాలు నెలకొన్నాయి. గడిచిన రెండేళ్లుగా ఇన్వెస్టర్లతో జరిపిన చర్చల్లో.. ఈ అంశం పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా వార్తలు నిజమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు ‘ అని కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్‌ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, ఈక్విటీకి ఎంత విలువ కడతారు, ఈ–కామర్స్‌ విభాగాన్ని కూడా జియోలోనే కలిపి చూపిస్తారా, సాఫ్ట్‌బ్యాంక్‌ వాస్తవంగా ఎంత ఇన్వెస్ట్‌ చేస్తుంది అన్నవి చూడాల్సిన అంశాలని జేపీ మోర్గాన్‌ అభిప్రాయపడింది. 10–15 బిలియన్‌ డాలర్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్‌ వ్యాపారంలో 25 శాతం వాటాలు కొనేందుకు సౌదీ అరేబియా చమురు దిగ్గజం ఆరామ్‌కో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా జియోలో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడుల వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జియో ఇన్ఫోకామ్‌లో వాటాల కొనుగోలుకోసం సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన విజన్‌ ఫండ్‌ ప్రస్తుతం మదింపు ప్రక్రియ చేపట్టిందన్న వార్తలు ఈ అంచనాలకు మరింతగా ఊతమిస్తున్నాయి. 2016 సెప్టెంబర్‌లో 4జీ టెక్నాలజీ ఆధారిత టెలికం సర్వీసులతో కార్యకలాపాలు ప్రారంభించిన జియో.. రెండేళ్ల వ్యవధిలోనే దేశంలోనే మూడో అతి పెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించింది. 

రిలయన్స్ రిటైల్‌ 35 బిలియన్ డాలర్లు...
జియో విలువ సుమారు 50 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. జియో రుణభారం అర్థవంతమైన స్థాయిలో తగ్గించుకోవాలంటే ఇన్వెస్టర్ల నుంచి 5 బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు రావాల్సి ఉంటుందని తెలిపింది. రిలయన్స్‌ రిటైల్‌ ఈక్విటీ విలువ 35 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. జియో వేల్యుయేషన్‌ అధిక స్థాయికి పెంచేటువంటి కొద్దిపాటి వాటాల విక్రయం వల్ల సంస్థకు అర్థవంతమైన ప్రయోజనం చేకూరకపోవచ్చని పేర్కొంది. కొత్తగా రాబోయే ఇన్వెస్ట్‌మెంట్స్‌.. జియోలో ఈక్విటీ పెట్టుబడుల రూపంలో ఉండాలని, ప్రతిపాదిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్‌విట్‌)  ద్వారా వస్తే పాక్షికంగా రుణం రూపంలో ఉన్నట్లు అవుతుందని జేపీ మోర్గాన్‌ వివరించింది.

33 బిలియన్‌ డాలర్ల రిలయన్స్‌ రుణ భారం...
హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రుణభారం (కన్సాలిడేటెడ్‌) 42.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. సవరించిన లెక్కల ప్రకారం నాలుగో త్రైమాసికం నాటికి 33.2 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. టెలికం కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ ఇందుకు తోడ్పడింది. ఇందులో భాగంగా టవర్స్, ఫైబర్‌ అసెట్స్‌ కోసం రెండు వేర్వేరు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణను రెండు వేర్వేరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్టులు (ఇన్‌విట్స్‌)కు అప్పగించింది. అలాగే దాదాపు రూ. 70,000 కోట్ల విదేశీ రుణాలను, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రూ. 36,600 కోట్ల పెట్టుబడులను ఈ ఇన్‌విట్స్‌కు బదలాయించారు. ఈ ఇన్‌విట్స్‌లోకి వచ్చే పెట్టుబడులు, తదుపరి ఆయా రెండు అనుబంధ సంస్థల రుణాలు తీర్చేందుకు ఉపయోగపడొచ్చని రిలయన్స్‌ భావిస్తోంది. ‘రాబోయే రోజుల్లో ఇన్‌విట్స్‌లో వాటాలను విక్రయించడం ద్వారా ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రిలయన్స్‌ పెట్టుబడులు సమీకరించవచ్చు. అదే సమయంలో ఆయా ఇన్‌విట్స్‌కు ఆదాయాలను పెంచడంపైనా దృష్టి పెడుతుంది. ఆయా అసెట్స్‌ను ఉపయోగించుకుంటున్నందుకు గాను జియో యాంకర్‌ టెనెంట్‌గా అద్దెలు చెల్లిస్తుంది. అలాగే ఇతర టెలికం ఆపరేటర్లు, కస్టమర్లకు కూడా ఈ అసెట్స్‌ను అద్దెకివ్వడం ద్వారా టవర్లు, ఫైబర్‌ అసెట్స్‌ నిర్వహణకు ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలకు ఆదాయం వస్తుంది‘ అని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది.  ‘ఏదైతేనేం మొత్తం మీద రుణభారం తగ్గించుకోవడం ప్రధానంగా ఉండబోతోంది. ఇందుకోసం మరిన్ని అసెట్స్‌ను విక్రయించే అవకాశం ఉంది. ఆదాయార్జన పటిష్టంగా పుంజుకుంటుండటం, టెలికం.. రిటైల్‌ వ్యాపారాల భవిష్యత్తు ఈ దశాబ్దం తర్వాత కూడా పటిష్టంగా ఉంటుందన్న అంచనాలు నెలకొనడం సానుకూలాంశాలు ‘ అని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. 



You may be interested

ఆయిల్‌ షేర్లు జంప్‌..లాభాలతో మార్కెట్‌ ప్రారంభం

Wednesday 24th April 2019

మూడురోజులపాటు వరుస నష్టాల్ని చవిచూసిన స్టాక్‌ సూచీలు బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్ల లాభంతో 38,673 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,601 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఐఓసీలు 2-4 శాతం చొప్పున ట్రేడింగ్‌ ప్రారంభంలోనే జంప్‌చేసాయి. గ్రాసిమ్‌, హీరో మోటో, వేదాంత, ఆదాని పోర్ట్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి.  ఆసియా మార్కెట్లు డౌన్‌  తాజాగా ఆసియా సూచీల్లో

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 24th April 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు పిర‌మ‌ల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌:- కంపెనీ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్లకు స్వల్ప ధీర్ఘకాలిక రుణ స‌దుపాయాల‌కు ఇక్రా రేటింగ్ సంస్థ ఎ1(+) కేటాయించింది. ఇండ‌స్ ఇండ్‌ బ్యాంక్:- ఇండ‌స్ఇండ్ బ్యాంక్ భార‌తీ ఫైనాన్షియ‌ల్ ఇన్‌క్లూజ‌న్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.  టైగ‌ర్ లాజిస్టిక్స్‌(ఇండియా):- ఇండియ‌న్ రైల్వేవేస్‌( చిత్తరంజ‌న్ లోకోమోటివ్ వ‌ర్క్స్‌)నుంచి మ‌రో ప్రాజెక్ట్‌ను ద‌క్కించుకుంది.  మెక్న‌ల్లీ భార‌త్ ఇంజ‌నీరిగ్స్ కంపెనీ:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా వీరేంద్ర కుమార్ వ‌ర్మ

Most from this category