STOCKS

News


సాఫ్ట్‌బ్యాంకులోకి కీర్తిగా రెడ్డి

Saturday 8th December 2018
news_main1544240872.png-22752

న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంకు 100 బిలియన్‌ డాలర్ల విజన్‌ ఫండ్‌ నిర్వహణ బాధ్యతలను ఫేస్‌బుక్‌ నుంచి తీసుకుంటున్న కీర్తిగారెడ్డికి అప్పగిస్తోంది. విశేషమేమిటంటే సాఫ్ట్‌బ్యాంకు ఓ మహిళను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయటం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెట్టుబడులకు సంబంధించి సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు పరిధిలో 12 ఫండ్స్‌ ఉన్నాయి. ‘‘సాఫ్ట్‌బ్యాంకు ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌లో కీర్తిగారెడ్డి చేరారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫండ్‌ను ఆమె నిర్వహిస్తారు. సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీప్‌ నిషార్‌తో కలసి పనిచేస్తారు’’ అని సాఫ్ట్‌బ్యాంకు ప్రతినిధి తెలియజేశారు.  కీర్తిగారెడ్డి భారత్‌, అమెరికాల్లో ఫేస్‌బుక్‌ కోసం పనిచేశారు. స్టాండర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులోనూ పనిచేస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంకు విజన్‌ ఫండ్‌కు ఉబెర్‌ టెక్నాలజీస్‌, వివర్క్‌, చైనాకు చెందిన దీదీ చుక్సింగ్‌ తదితర బడా సంస్థల్లో వాటాలున్నాయి. విజన్‌ ఫండ్‌ పార్ట్‌నర్లలో అందరూ మగవారే ఉండడంపై గత సెప్టెంబర్‌లో సాఫ్ట్‌బ్యాంకు వ్యవస్థాపకుడు మసయోషి సన్‌ ఓ ప్రశ్న ఎదుర్కొన్నారు. అయితే, తనకు ఎవరి పట్లా వివక్ష లేదని ఆ సందర్భంలోనే ఆయన స్పష్టం చేశారు. 



You may be interested

రూ.24 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు గత నెలలో 8 శాతం ఎగసి రూ.24 లక్షల కోట్లకు పెరిగాయి. లిక్విడ్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులు జోరుగా పెరగడంతో ఫండ్‌ ఆస్తులు ఈ స్థాయిలో పెరిగాయని యాంఫీ(అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా) పేర్కొంది. సంపద వృద్ధికి మ్యూచువల్‌ ఫండ్స్‌ తగిన సాధనాలన్న అంచనాలతో వచ్చే ఏడాది ఫండ్స్‌ల్లో మరింత జోరుగా పెట్టుబడులు వస్తాయని వివరించింది.  ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇతరత్రా అంశాలపై యాంఫీ

971 కోట్లు సమీకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బాసిల్‌-3 బాండ్ల జారీ ద్వారా రూ.971 కోట్లు సమీకరించింది. ఒక్కోటి రూ.10 లక్షల ముఖ విలువ గల బాసెల్‌-3  టైర్‌ టూ బాండ్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. ఈ అన్‌సెక్యూర్డ్‌, రిడీమబుల్‌ బాండ్ల కూపన్‌ రేటు 8.42 శాతం. ఈ బాండ్ల జారీ గురువారమే ఆరంభమై, అదే రోజు ముగిసిందని, 17 సంస్థలకు ఈ బాండ్లు

Most from this category