STOCKS

News


శోభ ఆదాయం రూ.676 కోట్లు

Saturday 10th November 2018
news_main1541828103.png-21844

న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ, శోభ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 22 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.50 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.61 కోట్లకు పెరిగిందని శోభ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.658 కోట్ల నుంచి రూ.676 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, వైస్‌ చైర్మన్‌ జేసీ శర్మ వెల్లడించారు. కేరళలో వరదలు రావడం ప్రతికూల ప్రభావం చూపించినా, వృద్ధి జోరును కొనసాగించామని వివరించారు. తమ ప్రధానమైన మార్కెట్‌ బెంగళూరులో మంచి పనితీరు సాధించామని పేర్కొన్నారు. ఇక గురుగ్రామ్‌ మార్కెట్లో ఆరేళ్లలోనే అధిక అమ్మకాలు సాధించామని వివరించారు. అన్ని మార్కెట్లలో, అన్ని సెగ్మెంట్లలో డిమాండ్‌ నిలకడగా వృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ కంపెనీ బెంగళూరు, గురుగ్రామ్‌, చెన్నై, పుణే, కోయంబత్తూర్‌, త్రిసూర్‌, క్యాలికట్‌, కొచ్చిన్‌, మైసూర్‌.. మొత్తం తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో శోభ షేర్‌ 1.5 శాతం లాభంతో రూ.465 వద్ద ముగిసింది. 



You may be interested

ఐఈఎక్స్‌ లాభం 30 శాతం అప్‌

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌(ఐఈఎక్స్‌)నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 30 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.33 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.43 కోట్లకు పెరిగిందని ఐఈఎక్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.61 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  నికర లాభం 30 శాతం పెరగడంతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.178ను తాకింది.

ఆర్‌బీఐ నిధులపై కేంద్రం కన్ను!?

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వద్దనున్న భారీ నిధులపై కేంద్రం కన్నేసిందా? వాటిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని భావిస్తోందా..? నిజం ఇప్పటికైతే వాస్తవ రూపం దాల్చలేదు కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం దీనిపై ఆరోపణలకు దిగింది. మోదీ సర్కారు ద్రవ్యలోటు సంక్షోభం గట్టెక్కేందుకు ఆర్‌బీఐ నిధులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ‘‘ప్రభుత్వం ద్రవ్యలోటు సంక్షోభంలో ఉంది. ఎన్నికల సంవత్సరంలో వ్యయాలను పెంచాలనుకుంటోంది. ఇందుకోసం ఆర్‌బీఐ

Most from this category