STOCKS

News


ఎన్‌సీడీల ద్వారా రూ.700 కోట్లు సమీకరిస్తాం

Wednesday 11th July 2018
news_main1531328258.png-18224

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, శోభ లిమిటెడ్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.700 కోట్లు సమీకరించనున్నది.  రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల అమలు కోసం అవసరమయ్యే నిధులను  నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు(ఎన్‌సీడీ)లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన జారీ చేసి సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 7న నిర్వహించే ఏజీఎమ్‌(వార్షిక సాధారణ సమావేశం)లో వాటాదారుల ఆమోదం పొందుతామని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుత ఏడాది తొలి మూడు నెలల కాలంలో బుకింగ్స్‌ అమ్మకాలు 22 శాతం వృద్ధితో రూ.762 కోట్లకు పెరిగాయని ఈ కంపెనీ ఇటీవలనే తెలిపింది.



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలు

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశీయంగా తొలి ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. మొబైల్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్ నంబరుకైనా కాల్ చేసే సదుపాయం దీనితో అందుబాటులోకి రానుంది. జులై 25 నుంచి ఈ సర్వీసులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ 'వింగ్స్‌'ను కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా బుధవారం ఆవిష్కరించారు. "ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్న

వైకింగ్‌ బ్రాండ్‌ మళ్లీ తెస్తోన్న హీరో సైకిల్స్‌

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: ప్రపంచపు అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీ ‘హీరో సైకిల్స్‌’ తాజాగా బ్రిటన్‌కు చెందిన 110 ఏళ్ల చరిత్ర కలిగిన  మోస్ట్‌ పాపులర్‌ సైకిల్‌ బ్రాండ్‌ ‘వైకింగ్‌’ను మళ్లీ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వైకింగ్‌ బ్రాండ్‌ను కలిగిన అవోసెట్‌ సైకిల్స్‌ను 2015లో హీరో సైకిల్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల తర్వాత యూకేలోని సైకిల్‌ షాప్స్‌లో వైకింగ్‌ బ్రాండ్‌ సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ‘‘యాజమాన్యం మార్పు సహా పలు

Most from this category