STOCKS

News


నకిలీ ఉత్పత్తులకు స్నాప్‌డీల్‌ చెక్‌...

Tuesday 27th November 2018
news_main1543299306.png-22412

  • 'బ్రాండ్‌ షీల్డ్‌' విధానం అమలు

న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్‌ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ తాజాగా 'బ్రాండ్ షీల్డ్' పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్‌ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్‌డీల్‌లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌, పేటెంట్‌, డిజైన్‌పరంగా జరిగే మేథోహక్కుల ఉల్లంఘనలను బ్రాండ్‌ షీల్డ్‌ విధానం కింద సదరు సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని స్నాప్‌డీల్ తెలిపింది. ఈ విధానంలో వచ్చే ప్రతి ఫిర్యాదును తమ సిబ్బంది ప్రత్యేకంగా పరిశీలిస్తారని, ఒకవేళ ఉల్లంఘన రుజువైన పక్షంలో సదరు ఉత్పత్తులను పోర్టల్‌ నుంచి తొలగిస్తామని పేర్కొంది.



You may be interested

రూ.750 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు హెచ్‌ఈజీ బోర్డు ఆమోదం

Tuesday 27th November 2018

న్యూఢిల్లీ: గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌లు తయారు చేసే హెచ్‌ఈజీ కంపెనీ రూ.750 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. సోమవారం జరిగిన  డైరెక్టర్ల బోర్డ్‌ ఈ షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపిందని హెచ్‌ఈజీ వెల్లడించింది. మరోవైపు ఉత్పత్తి పెంపునకు సంబంధించిన రూ.1,200 కోట్ల మూలధన పెట్టుబడుల ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించింది. ఈ​ప్రతిపాదనలో భాగంగా  ప్రస్తుతం 80,000 టన్నులుగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 20,000 టన్నులు పెంచనున్నామని

మూడు ఐపీఓలకు సెబీ ఆమోదం

Tuesday 27th November 2018

సెబీ ఆమోదం పొందిన ఐపీఓల సంఖ్య @73 న్యూఢిల్లీ: మూడు కంపెనీల ఐపీఓలకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌, మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌,  ఎక్సెల్ప్‌ మ్యాక్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ కంపెనీల ఐపీఓలకు సెబీ పచ్చజెండా ఊపింది. దీంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 73కు పెరిగింది. ఇన్వెన్షియా ఐపీఓ రూ.450 కోట్లు ఐపీఓలో భాగంగా ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ కంపెనీ

Most from this category