STOCKS

News


ఈకామర్స్ సంస్థలకూ అసోసియేషన్‌

Thursday 14th March 2019
news_main1552546751.png-24603

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ సంస్థలు తాజాగా ది ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీఈసీఐ) ఏర్పాటు చేసుకున్నాయి. స్నాప్‌డీల్‌, షాప్‌క్లూస్‌, అర్బన్‌క్లాప్ తదితర సంస్థలు కలిసి దీన్ని నెలకొల్పాయి. అంతర్జాతీయ సంస్థలకు దీటుగా దేశీ సంస్థలు కూడా రాణించేందుకు, దేశీ ఈ-కామర్స్ రంగం వృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి తోడ్పడే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. డేటా ప్రైవసీ, లాజిస్టిక్స్‌, పేమెంట్స్ తదితర అంశాలకు సంబంధించి భారతీయ ఈ-కామర్స్ రంగంలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు టీఈసీఐ ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. 2017లో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్‌, ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తదితరులు కలిసి ఇండియాటెక్ పేరుతో ఇటువంటిదే లాబీ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దేశీ స్టార్టప్స్‌కు సమాన అవకాశాలు కల్పించడం, ఐపీవో నిబంధనలను సరళతరం చేయడం, శక్తిమంతులైన ఇన్వెస్టర్ల నుంచి ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రయోజనాలు పరిరక్షించేలా డిఫరెన్షియల్ వోటింగ్ విధానంలో మార్పులు తేవడం తదితర లక్ష్యాలతో ఇది ఏర్పాటైంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ నుంచి బన్సల్‌ నిష్క్రమణ అనంతరం దీని కార్యకలాపాలు నిల్చిపోయాయి. తాజాగా టీఈసీఐ ఆ లోటు భర్తీ చేయనుంది.



You may be interested

షేర్‌ఖాన్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Thursday 14th March 2019

ఎన్నికల ముందు వచ్చే ర్యాలీలో మంచి సత్తా చూపే నాలుగు మిడ్‌క్యాప్స్‌ను షేర్‌ఖాన్‌ సిఫార్సు చేస్తోంది. అందరూ ఊహించినట్లు ఎఫ్‌ఎంసీజీ స్టాకులో లేదా బాటా, టైటాన్‌ లాంటి కన్జూమర్‌ స్టాకులో కాకుండా ప్రీఎలక‌్షన్‌ ర్యాలీలో కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించింది.  1. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: షేరులో కొంత బలహీనత కనిపిస్తున్నా, త్వరలో కోలుకొని దూసుకుపోగలదు.  2. అతుల్‌: మిడ్‌క్యాప్‌ నుంచి లార్జ్‌క్యాప్‌గా మారనుంది. రెండేళ్ల తర్వాత షేరులో మంచి కదలికలు కనిపిస్తున్నాయి.  3, 4:

భారత్‌–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం

Thursday 14th March 2019

30 బిలియన్‌ డాలర్లకు  భారత్‌–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది ఇండియా, రష్యా ఇరు దేశాల మధ్య 11 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని.. 2025 నాటికిది 30 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని రష్యాలోని టాంస్క్‌ రీజియన్‌ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌ఈ ఆండ్రూ ఆంటనోవ్‌ అంచనా వేశారు. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ ఉత్పత్తులు, మైనింగ్, మిషనరీ బిల్డింగ్, న్యూక్లియర్, ఫార్మా, మెటల్‌ ఉత్పత్తులు భారత్‌తో పాటూ 48 దేశాలకు ఎగుమతి అవుతుంటాయని

Most from this category