STOCKS

News


ఏపీ నుంచి మెడికల్‌..

Friday 10th May 2019
news_main1557472501.png-25657

  • తెలంగాణ నుంచి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు
  • స్నాప్‌డీల్‌లో ఎక్కువగా అమ్ముడయ్యేవివే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్‌ కంపెనీ స్నాప్‌డీల్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువగా అమ్ముడుపోయేవి మెడికల్‌ ఉత్పత్తులు కాగా, తెలంగాణ నుంచి ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలే ఎక్కువగా కొంటున్నారు. ‘‘హైదరాబాద్‌ నుంచి కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్స్‌ మదర్‌బోర్డ్స్, ర్యామ్, బ్యాటరీలు, అడాప్టర్లు, హార్డ్‌ డివైజ్‌లకు డిమాండ్‌ ఉంది. కర్నూల్‌లో స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ డివైజ్‌లు, కేబుల్‌ చార్జర్లు, స్పీకర్లు, హెడ్‌ఫోన్లకు, కడప నుంచి ధర్మామీటర్లు, బీపీ, హార్ట్‌ రేట్‌ మానీటర్లు, డయాబెటిక్‌ కేర్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ ఉందని’’ స్నాప్‌డీల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజనీష్‌ వాహీ తెలియజేశారు.
200 బిలియన్‌ డాలర్లకు ఆన్‌లైన్‌..
భారత వినియోగ వ్యయం 800 బిలియన్‌ డాలర్లుగా ఉందని, 2025 నాటికి 2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ ఈ–కామర్స్‌ మార్కెట్‌ వాటా 2 శాతంగా ఉందని.. 2025 నాటికి 10 శాతానికి.. ఏడేళ్లకు ఆన్‌లైన్‌ మార్కెట్‌ 200 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని వాహీ తెలిపారు. దేశీయ రిటైల్‌ పరిశ్రమలో 10 శాతం సంఘటిత మార్కెట్‌ కాగా.. 90 శాతం అసంఘటిత మార్కెట్‌ అని, దేశంలో 10 కోట్ల మంది ఆన్‌లైన్‌ యూజర్లుండగా... నెలకు 7.7 కోట్ల మంది యూజర్లు స్నాప్‌డీల్‌ను విజిట్‌ చేస్తున్నారని వాహీ చెప్పారు. స్నాప్‌డీల్‌కు ఎలాంటి ఇన్వెంటరీ, ప్రైవేట్‌ లేబుల్స్‌ లేవని, జస్ట్‌ ఆన్‌లైన్‌ వేదిక ఉత్పత్తుల విక్రయాలే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 5 లక్షల మంది సెల్లర్స్‌ ఉన్నారని, గతేదారి 50 వేల మంది నమోదయ్యారని తెలిపారు.



You may be interested

ఈజ్‌మైట్రిప్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

Friday 10th May 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సేవల సంస్థ ఈజ్‌మైట్రిప్‌ తెలంగాణ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిస్కౌంటు ఆఫర్లు ప్రకటించింది. తమ పోర్టల్‌ ద్వారా ఫ్లయిట్‌ టికెట్లు బుక్‌ చేసుకునే తెలంగాణవాసులకు దేశీ ఫ్లయిట్స్‌పై రూ.500, అంతర్జాతీయ ఫ్లయిట్స్‌పై రూ. 2,000 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకురాలు, సీవోవో రికాంత్‌ పిట్టి తెలిపారు. ఇందుకోసం ఈఎంటీతెలంగాణ అనే ప్రమో కోడ్‌ అప్లై చేయాల్సి ఉంటుందని గురువారమిక్కడ నిర్వహించిన

విశాఖ పోర్టు లాభం రూ. 200 కోట్లు

Friday 10th May 2019

ఏటా ఐదు శాతం వృద్ధి రేటు రూ. 3,700 కోట్లతో పోర్టు ఆ«ధునికీకరణ రూ. 5 వేల కోట్లతో కాలుష్య నియంత్రణ చర్యలు  విలాసవంతమైన క్రూయిజ్‌ల నిర్మాణం కోసం 77 కోట్లు ఖర్చు విశాఖ పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు వెల్లడి సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు గడిచిన ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి ఏటా

Most from this category