News


చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్ల పెంపు

Thursday 20th September 2018
Markets_main1537424853.png-20399

ముంబై:- చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీరేటును పెంచింది. మూడో త్రైమాసిక కాలానికి(అక్టోబర్‌1 నుంచి డిసెంబర్‌ 31) పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) సహా పలు పొదుపు పథకాలపై వడ్డీరేటును 0.4శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ), సుకన్య సమృద్ధి ఖాతా, పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్స్‌ పథకాలపై వడ్డీ శాతం పెరగనుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు 0.3శాతం నుంచి 0.4శాతం మధ్య పెంచుతున్నట్లు సెప్టెంబర్‌ 19న ఆర్థిఖ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై వడ్డీరేటు 7.6శాతం ఉండగా పెంచిన వడ్డీ రేట్ల ప్రకారం ఇప్పుడు 8శాతానికి చేరుకుంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీరేటుపై గతంలో 8.1శాతం వడ్డీరేటు ఉండగా ఇప్పుడు 8.5శాతానికి పెరిగింది. అలాగే సీనియర్‌ సిటిజన్స్‌ అయిదేళ్ల పొదుపు ఖాతాకు వడ్డీరేటు 8.7శాతానికి పెరగింది. పెంచిన ఈ వడ్డీరేట్లు అక్టోబర్‌1 నుంచి అమలులోకి రానున్నాయి. గత రెండు త్రైమాసికాల్లో చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లను యధాతథంగా ఉంచిన ప్రభుత్వం ఇప్పుడు వడ్డీ రేట్లను పెంచడంతో ఫిక్స్‌డ్‌ ఇన్‌కం ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



You may be interested

అమెజాన్‌ చేతికి మోర్‌..!

Thursday 20th September 2018

 రూ. 4,200 కోట్ల డీల్‌ ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి మరింతగా విస్తరణ - సమర ఫండ్‌తో కలిసి కొనుగోలు న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన మోర్‌ సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ (ఆదిత్య బిర్లా రిటైల్‌ –ఏబీఆర్‌ఎల్‌) ఇక అంతర్జాతీయ రిటైలింగ్‌ దిగ్గజం అమెజాన్‌ చేతికి చేరనుంది. ఇందుకు సంబంధించి సమర ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో మోర్‌ బ్రాండ్‌ మాతృసంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్‌  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 4,200

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 37 పాయింట్లు అప్‌

Thursday 20th September 2018

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గురువారం ఉదయం 10.30 గంటల సమయానికి 33 పాయింట్ల పెరుగుదలతో 11,310పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. క్రితం రోజు ఇక్కడ భారీ పతనం తర్వాత నిఫ్టీ ఫ్యూచర్‌ 11,377 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానమయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 33 పాయింట్లు పెరిగింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు ర్యాలీ జరపడం, ఎస్‌ అండ్‌ పీ

Most from this category