STOCKS

News


5.15 లక్షల కోట్లకు బ్యాంకు రుణాలు

Wednesday 13th March 2019
news_main1552461302.png-24581

- 4.86 శాతం వృద్ధితో 4.33 లక్షల కోట్లకు డిపాజిట్లు
- తెలంగాణ ఎస్‌ఎల్‌బీసీ వెల్లడి

హైదరాబాద్‌ బిజినెస్‌ బ్యూరో: గతేడాది డిసెంబర్‌ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కార్యాలయంలో జరిగిన 22వ ఎస్‌ఎల్‌బీసీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ జే.స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి (సీడీ రేషియో) 100% పైనే ఉంది. తాజాగా 119.05 శాతానికి చేరుకుంది. ఎంఎస్‌ఎంఈ విభాగం అనుకున్న విధంగా 134.31 శాతానికి చేరింది. ముద్రా రుణాలు సైతం నిర్థేశిత లక్ష్యం మేర పెరిగాయి’ అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనరు, ఎస్‌బీఐ జీఎం ఉన్‌ మయ్యాతో పాటు ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రతా దాస్‌, జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.శంకర్‌, తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్‌ సుల్తానియా, రాహుల్‌ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.



You may be interested

ఎస్‌బీఐ మొండిబకాయిల వేలం షురూ!

Wednesday 13th March 2019

22, 26 తేదీల్లో  రూ.3,640 కోట్లకుపైగా ఎన్‌పీఏల వేలం ముంబై: మొండిబకాయిల (ఎన్‌పీఏ) వేలాన్ని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వేగవంతం చేసింది. దీని ప్రకారం మార్చి 26న రూ.2,338 కోట్ల విలువైన మొండిబకాయిల వేలాన్ని నిర్వహించనుంది. బ్యాంకులు, ఏఆర్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇతర ఆర్థిక సంస్థలకు పూర్తి 100 శాతం నగదు ప్రాతిపదికన ఎన్‌పీఏ అకౌంట్లను విక్రయించనున్నట్లు మంగళవారం తన వెబ్‌సైట్‌లో తెలిపింది. విక్రయించనున్న అకౌంట్లలో ఇండియన్‌ స్టీల్‌

ఈ నెల 18 నుంచి తొలి రీట్‌

Wednesday 13th March 2019

- ఆఫర్‌ చేస్తున్న ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ - ప్రైస్‌బ్యాండ్‌ రూ.299- 300 న్యూఢిల్లీ: భారత్‌లో తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌) ఈ నెల 18 నుంచి ఆరంభం కానున్నది. ఈ నెల 20న ముగిసే ఈ రీట్‌ ఆఫర్‌కు రూ.299- 300 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌​కంపెనీ బ్లాక్‌స్టోన్‌, రియల్టీ కంపెనీ ఎంబసీల జాయింట్‌ వెంచర్‌, ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ ఈ రీట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

Most from this category