STOCKS

News


స్కెచర్స్‌ చేతికి ఫ్యూచర్స్‌ 49 శాతం వాటా

Thursday 14th February 2019
Markets_main1550123720.png-24188

  • డీల్‌ విలువ రూ.600 కోట్లు !

న్యూఢిల్లీ: స్కెచర్స్‌ ఇండియా జాయింట్‌ వెంచర్‌లో ఫ్యూచర్స్‌ గ్రూప్‌నకు ఉన్న 49 శాతం వాటాను మాతృ కంపెనీ స్కెచర్స్‌ యూఎస్‌ఏ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు  వెల్లడించలేదు.  అయితే ఈ వాటా కొనుగోలు కోసం అమెరికాకు చెందిన స్కెచర్స్‌ కంపెనీ రూ.600 కోట్లు వెచ్చించిందని సమాచారం. దీంతో స్కెచర్స్‌ ఇండియా  ఇక పూర్తిగా స్కెచర్స్‌ యూఎస్‌ఏ అనుబంధ సంస్థగా మారిపోయింది. 

మరింతగా వృద్ధి జోరు...
ఇతర దేశాల్లో లాగానే భారత్‌లో కూడా మంచి వృద్ధి అవకాశాలుంటాయనే ఉద్దేశంతో భారత్‌లోకి ప్రవేశించామని స్కెచర్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ వీన్‌బర్గ్‌ చెప్పారు. వృద్ధి అవకాశాలు బాగా ఉంటాయనే అంచనాలతో జాయింట్‌ వెంచర్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేశామని వివరించారు. ఈ కొనుగోలు స్కెచర్స్‌ ఇండియా వృద్ధి జోరును మరింతగా పెంచుతుందని స్కెచర్స్‌ సౌత్‌ ఏషియా సీఈఓ రాహుల్‌ విరా పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణను మరింత వేగవంతం చేస్తుందని, భారత్‌లో మరింత మార్కెట్‌ వాటా కొనుగోలు కోసం పటిష్టమైన నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడానికి ఈ కొనుగోలు దోహదం చేస్తుందని వివరించారు.
ఈ ఏడాది 80 నుంచి వంద కొత్త స్టోర్స్‌....
 స్కెచర్స్‌ కంపెనీ ఫ్యూచర్‌ గ్రూప్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు ద్వారా భారత్‌లో 2012లో ప్రవేశించింది.  ప్రస్తుతం భారత్‌లో స్కెచర్స్‌ కంపెనీ 223 రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. వీటిల్లో 61 స్వంత స్టోర్స్‌ కాగా, మిగిలినవి థర్డ్‌ పార్టీ ఆధ్వర్యంలోనివి. ఈ ఏడాది కొత్తగా 80 నుంచి వంద స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.



You may be interested

చైనా స్మార్ట్‌ఫోన్స్ హవా

Thursday 14th February 2019

దేశీయంగా అమ్ముడయ్యే ప్రతి 10 ఫోన్స్‌లో 6 చైనావే కష్టాల్లో దేశీ మొబైల్‌ తయారీ సంస్థలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన మార్కెట్‌ వాటా న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో చైనా కంపెనీల ధాటికి ఎదురు నిలవలేక దేశీ సంస్థలు కుదేలవుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం దాకా ఆధిపత్యం కొనసాగించిన మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, ఇంటెక్స్‌ వంటి దేశీ బ్రాండ్స్‌ అమ్మకాలు ప్రస్తుతం గణనీయంగా క్షీణించాయి. 2015లో స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో దేశీ సంస్థల వాటా  43

అపోలో మ్యూనిక్‌లో ప్రమోటర్ల వాటా విక్రయం..

Thursday 14th February 2019

41 శాతం వాటాలకు రూ.1,200 కోట్లకు డీల్‌? నాలుగు సంస్థలతో చర్చలు ఆరు నెలల్లోగా డీల్ పూర్తయ్యే అవకాశాలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణభారం తగ్గించుకునే దిశగా ఆరోగ్య బీమా సేవలందించే జాయింట్ వెంచర్ సంస్థ అపోలో మ్యూనిక్ హెల్త్‌లో వాటాలను విక్రయించడంపై అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్స్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 41 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని సుమారు రూ.

Most from this category