STOCKS

News


ఫోర్బ్స్‌ టైకూన్స్‌లో పీవీ సింధు

Tuesday 25th September 2018
news_main1537851579.png-20550

ముంబై: క్రీడా, వ్యాపార, నటన రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన 22 మంది యువ సాధకుల జాబితాలో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చోటు దక్కించుకుంది. భవిష్యత్ దిగ్గజాల పేరిట ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ రూపొందించిన లిస్టులో స్థానం లభించిన ఏకైక క్రీడాకారిణి సింధు మాత్రమే. అపోలో లైఫ్ ఎండీ ఉపాసనా కామినేని కూడా ఈ జాబితాలో ఉన్నారు. నికర సంపద విలువతో పాటు పలు అంశాల ప్రాతిపదికన తయారు చేసిన ఈ లిస్టులో డిస్కౌంటు బ్రోకింగ్ సంస్థ జీరోధా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్‌.. నితిన్ కామత్‌, ఓయో రూమ్స్‌ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్‌, యస్‌ బ్యాంక్ సీఈవో రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్ ఖన్నా తదితరులకు చోటు లభించింది. ఆయా రంగాల్లో తమదైన  ముద్ర వేస్తున్న తొలి తరం వ్యాపారవేత్తలు, కుటుంబ వ్యాపార దిగ్గజాల వారసులు, యాక్టర్లు, క్రీడాకారులు మొదలైన వారితో దీన్ని రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఇది కేవలం భారత జాబితానేనని వివరించింది. 



You may be interested

అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు సెబీ ఓకే

Tuesday 25th September 2018

 కోల్‌కత: బిస్కెట్లు తయారు చేసే అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఆదాయం పరంగా దేశంలో నాలుగో అతి పెద్ద బిస్కెట్‌ బ్రాండ్‌, ఐదో అతి పెద్ద కేక్‌ బ్రాండ్‌ తమ కంపెనీవేనని అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఈ కంపెనీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,240

ఫేస్‌బుక్‌ ఇండియా ఎమ్‌డీగా అజిత్‌ మోహన్‌

Tuesday 25th September 2018

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారత కార్యకలాపాల మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా అజిత్‌ మోహన్‌ నియమితులయ్యారు. కొత్తగా సృష్టించిన ఈ హోదాలో ఆయన... మెన్లోపార్క్‌(అమెరికా)లోని ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్‌ చేస్తారు. వచ్చే ఏడాది మొదట్లో ఆయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. గతంలో ఆయన హాట్‌స్టార్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 

Most from this category