News


తొలి దేశీ 4జీ సెమీకండక్టర్ చిప్‌ ఆవిష్కరణ

Thursday 28th February 2019
news_main1551336135.png-24370

  • తయారు చేసిన సిగ్నల్‌చిప్ సంస్థ

న్యూఢిల్లీ: 4జీ, ఎల్‌టీఈ, 5జీ మోడెమ్స్‌లో ఉపయోగించడానికి అనువైన సెమీకండక్టర్ చిప్స్‌ను తొలిసారి దేశీయంగా రూపొందించినట్లు బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్ వెల్లడించింది. ఇందులో నాలుగు చిప్‌ల శ్రేణిని బుధవారం ఆవిష్కరించింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్‌చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు. తొలి దేశీ సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పనపై సిగ్నల్‌చిప్ సంస్థను టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ అభినందించారు. మరోవైపు, భద్రతాప్రమాణాలకు సంబంధించి అంతర్జాతీయంగా చైనా టెలికం పరికరాల తయారీ సంస్థలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మరింతగా అధ్యయనం చేయనున్నట్లు అరుణ చెప్పారు. "చాలా దేశాలు చైనా సంస్థల టెలికం పరికరాల విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి భారత్ కూడా దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది" అని చిప్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాలు చైనా కంపెనీలు.. ముఖ్యంగా హువావే సంస్థ తయారు చేసే టెలికం పరికరాలను ఉపయోగించరాదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అరుణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, హువావేకి వ్యతిరేకంగా కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ .. జర్మనీ తదితర దేశాలు మాత్రం ఆ సంస్థ పరికరాల వినియోగం కొనసాగించే యోచనలో ఉన్నాయి.



You may be interested

మార్కెట్లోకి మారుతి ఇగ్నిస్‌ 2019 ఎడిషన్‌

Thursday 28th February 2019

ధరల శ్రేణి రూ.4.79లక్షలు నుంచి 7.14 లక్షలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా... ఇగ్నిస్‌ మోడల్‌లో 2019 ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జూలై 1 నుంచి అమలుకానున్న ప్యాసింజర్ వాహనాల కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించినట్లు పేర్కొంది. అతివేగాన్ని హెచ్చరించే వ్యవస్థ, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్‌, డ్రైవర్‌ పక్కన ఉన్న వ్యక్తి సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోతే రిమైండ్‌ చేయడం వంటి భద్రతా ఫీచర్లతో విడుదలైన ఈ

బ్యాంకుల్లో రోబో హల్‌చల్‌

Thursday 28th February 2019

కస్టమర్ల సేవలకు చాట్‌బాట్స్‌, వాయిస్‌బాట్స్‌ ఆటోమేషన్‌ విధానానికి ప్రాధాన్యం మానవవనరుల వినియోగం తగ్గింపు ప్రైవేటు బ్యాంకుల ముందంజ న్యూఢిల్లీ: బ్యాంకులు టెక్నాలజీ ఆధారిత వేగవంతమైన సేవల వైపు అడుగులు వేస్తున్నాయి. సిబ్బంది అవసరాన్ని తగ్గించి టెక్నాలజీ సాయంతో ఆటోమేషన్‌ విధానంలో కస్టమర్ల విచారణలకు వివరాలు అందించడం, చాట్‌ ద్వారా, వాయిస్‌ ద్వారా సత్వర సేవలను అందించేందుకు విధానాలను అమలు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యస్‌ బ్యాంకులు కస్టమర్ల సేవలకు

Most from this category