STOCKS

News


ఇన్ఫీబీమ్‌ షేరును ఏం చేద్దాం?

Saturday 29th September 2018
Markets_main1538223302.png-20719

దూరంగా ఉండమంటున్న నిపుణులు
ఒక్కరోజులో 70 శాతం పతనమయిన ఇన్ఫీబీమ్‌ షేరుతో దాదాపు 9200 కోట్ల రూపాయల మదుపరుల సొత్తు ఆవిరైంది. వాట్సప్‌లో సర్క్యులేట్‌ అయిన ఒక మెసేజ్‌ కారణంగా షేరు కుప్పకూలినట్లు తెలుస్తోంది. తమ మూలాలు బలంగానే ఉన్నాయని మేనేజ్‌మెంట్‌ భరోసా ఇచ్చినా షేరు కోలుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఫీబీమ్‌ షేరు ఉన్న షేరు హోల్డర్లు కాస్త పెరిగినా బయటపడిపోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొత్తగా ఈ కౌంటర్‌లో కొనుగోళ్లు జరపొద్దని సలహా ఇస్తున్నారు. తాజా పతనంతో బడా హస్తాలు షేరు నుంచి వైదొలిగినట్లు తెలుస్తోందని, అందువల్ల దీనికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. గతేడాది మార్చిలో, సెప్టెంబర్‌లో, డిసెంబర్‌లో ఈ ఏడాది 21వ తారీకున షేరు భారీ కుదుపునకు లోనయింది. కానీ వెంటనే కోలుకుంది. అయితే ఈ దఫా పతనం గతంతో పోలిస్తే చాలా లోతుగా ఉందని మార్కెట్‌ పండితుల అంచనా. 
డెలివరీ డేటా భయపెడుతోంది..
శుక్రవారం బీఎస్‌ఈలో షేరు డెలివరీ డేటా గత శుక్రవారం(సెప్టెంబర్‌21- ఈరోజు షేరు దాదాపు 20 శాతం పతనమై, సోమవారం- 22వ తారీకున వెంటనే కోలుకుంది)తో పోలిస్తే దాదాపు 4.8 రెట్లు అధికంగా ఉంది. 29న డెలివరీ డేటా 28.46లక్షలుగా నమోదయింది. షేరు ధర పడిపోతూ, డెలివరీ డేటా పెరగడమనేది బేరిష్‌ సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. షేరులో మరింత కుంగుదల ఉంటుందని సెల్లర్లు భావిస్తున్నట్లు చెప్పారు. టెక్నికల్‌ చార్టుల్లో షేరు ధర అన్ని రకాల డీఎంఏ స్థాయిల దిగువకు వచ్చింది. కీలక 200 రోజుల డీఎంఏ స్థాయిని కోల్పోవడం భవిష్యత్‌లో మరింత పతానికి సంకేతమని నిపుణుల అంచనా. సూపర్‌ ట్రెండ్‌ ఇండికేటర్‌, ఎంఏసీడీ సైతం నెగిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అంతా ఈ కౌంటర్‌కు దూరంగా ఉండడం మంచిదని ప్రముఖ బ్రోకింగ్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. కొత్త కొనుగోళ్లు చేయడం కానీ, యావరేజ్‌ చేయడం కానీ తగదని సూచించారు. You may be interested

వచ్చే ఆరు నెలలు మార్కెట్లపై ప్రభావం చూపించేవి ఇవే!

Sunday 30th September 2018

దేశీయ, అంతర్జాతీయ అంశాలు ఎన్నో స్టాక్‌ మార్కెట్లను నష్టాల పాల్జేస్తుండడాన్ని చూస్తున్నాం. మార్కెట్లలో కొత్తగా లిక్విడిటీ సమస్య వచ్చినట్టు ఆందోళన కూడా నష్టాలకు మరింత ఆజ్యం పోసింది. మరి ఈ కాలంలో మీ దగ్గరున్న పోర్ట్‌ఫోలియోను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఆరు నెలల కాలంలో మన మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలు గురించి తెలుసుకుంటే, ఆ తర్వాత ఓ నిర్ణయానికి రావచ్చు. రూపాయి ఈ ఏడాది రూపాయి డాలర్‌ మారకంలో

ట్రేడింగ్‌ టిప్స్‌ దండగ!

Saturday 29th September 2018

ప్రముఖ అనలిస్టు దీపక్‌ మొహోని   బొంబాయి స్టాక్‌ ఎక్చేంజ్‌ సెన్సిటివ్‌ ఇండెక్స్‌.. తెలుసా మీకు... ఎప్పుడూ వినిపించినట్లు లేదా! పోనీ సెన్సెక్స్‌ తెలుసా.. పైన చెప్పిన పే.. ద్ద పేరును సంక్షిప్తపరిస్తే సెన్సెక్స్‌గా మారింది. ఈ పదాన్ని తొలుత ప్రముఖ అనలిస్టు దీపక్‌ మొహోని వినియోగించగా, బిజినెస్‌ జర్నలిస్టులందరికీ చాలా త్వరగా సుపరిచితమైంది. దేశంలో టెక్నికల్‌ అనాలసిస్‌ చార్టులు, విశ్లేషణలు అందుబాటులోకి తేవడంలో దీపక్‌ పాత్ర ఎంతో ఉంది. స్టాక్‌ మార్కెట్లలో

Most from this category