STOCKS

News


హజీరా ఎల్‌ఎన్‌జీ నుంచి ‘టోటల్‌’ నిష్క్రమణ

Tuesday 28th August 2018
news_main1535434001.png-19714

న్యూఢిల్లీ: హజీరా ఎల్‌ఎన్‌జీ టర్మినల్‌ నుంచి ఫ్రాన్స్‌ ఇంధన సంస్థ, టోటల్‌ ఎస్‌ఏ వైదొలగింది. హజీరా ఎల్‌ఎన్‌జీలో 26 శాతం వాటాను భాగ‍స్వామ్య సంస్థ, షెల్‌కు విక్రయించామని టోటల్‌ ఎస్‌ఏ తెలిపింది. ఈ మేరకు షెల్‌ కంపెనీతో ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ వాటా విక్రయానికి వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదాలు పొందాల్సి ఉందని పేర్కొంది.  షెల్‌ అనుబంధ సంస్థ, షెల్‌ గ్యాస్‌ బీవీ ఈ 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటా విక్రయానికి సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. మరోవైపు షెల్‌ కంపెనీకి ఏడాదికి 0.5 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీని ఐదేళ్ల పాటు విక్రయించడానికి ఒక ఒప్పందాన్ని టోటల్‌ కంపెనీ కుదుర్చుకుంది. 

గుజరాత్‌లోని హజీరా లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌(ఎల్‌ఎన్‌జీ) ఇంపోర్ట్‌ టెర్మినల్‌లో 26 శాతం వాటాను 2004లో టోటల్‌ కొనుగోలు చేసింది. అప్పుడు 2.5 మిలియన్‌ టన్నులుగా ఉన్న ఈ ఇంపోర్ట్‌ టెర్మినల్‌ సామర్థ్యం ఇప్పుడు 5 మిలియన్‌ టన్నులకు పెరిగింది. 



You may be interested

రుణాలు ఎగ్గొట్టిన విద్యుత్‌ కంపెనీలకు చుక్కెదురు!

Tuesday 28th August 2018

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన విద్యుత్‌ కంపెనీలపై దివాలా చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మార్గం సుగమం అయింది. మొండి బకాయిలుగా (ఎన్‌పీఏ) మారి 180 రోజుల్లోపు పరిష్కారం లభించని ఖాతాలను బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా, దీనికి వ్యతిరేకంగా విద్యుత్‌ కంపెనీలు

జీఎంఆర్ ప్లాంటుపై అదానీ కన్ను

Tuesday 28th August 2018

హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చెందిన విద్యుత్ ప్లాంటు టేకోవర్ ప్రయత్నాలను అదానీ పవర్ ముమ్మరం చేసింది. జీఎంఆర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీ (జీఎంఆర్‌సీఈ) కొనుగోలుకు సంబంధించిన డీల్‌ దాదాపు తుదిదశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్ కింద జీఎంఆర్‌సీఈకి చెందిన రూ. 5,800 కోట్ల రుణభారంలో దాదాపు రూ. 3,800 కోట్లు,  అలాగే రూ. 1,400 కోట్ల నిధులయేతర భారం అదానీ పవర్‌కు

Most from this category