STOCKS

News


గవర్నర్‌ తన ధర్మాన్ని పాటించాలి

Tuesday 25th December 2018
Markets_main1545722643.png-23222

ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాలి: సి.రంగరాజన్‌
ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడే విషయంలో నూతన గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తన ధర్మాన్ని అనుసరించాలని మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ సూచించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన తొలి ప్రభుత్వ అధికారి శక్తికాంతదాస్‌ కాదని చెప్పారాయన. ‘‘చాలా మంది ఢిల్లీ అధికారులు ఆర్‌బీఐలోకి వచ్చారు. ఇదే తొలిసారి కాదు. ఒక్కసారి వారు బాధ్యతలు చేపట్టాక ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడేందుకే కృషి చేశారు’’ అని రంగరాజన్‌ వ్యాఖ్యానించారు. ఇది ధర్మం వంటిదని, తనతోపాటు మాజీ గవర్నర్లంతా ఇదే అనుసరించారని చెప్పారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. శక్తికాంతదాస్‌ ఆర్‌బీఐ స్వతంత్రను పణంగా పెట్టకుండా, రెండింటి మధ్య వ్యవహారాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, పనిచేయగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీడీపీ గణన విషయంలో ఇటీవల చేసిన మార్పుల గురించి కొన్ని కనీస వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌వో) వెల్లడించాల్సిన అవసరం ఉందని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘సీఎస్‌వో ఎంతో పేరున్న సంస్థ. గత గణాంకాలను సవరించే విషయంలో అనుసరించిన విధానాన్ని మరింత ‍స్పష్టం చేయాలి’’ అని కోరారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుమఖం పడితే, ఆర్‌బీఐ ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.



You may be interested

అల్టోను అధిగమించిన స్విఫ్ట్‌

Tuesday 25th December 2018

బాగా అమ్ముడైన టాప్‌-10లో ఆరు మారుతీవే చివరి నాలుగు స్థానాలను సాధించిన హ్యుందాయ్‌ సియామ్‌ వెల్లడి న్యూఢిల్లీ: అధికంగా అమ్ముడవుతున్న ప్రయాణికుల కారుగా మారుతీ ఆల్టోను తోసిరాజని అదే కంపెనీకి చెందిన స్విఫ్ట్‌ నిలిచింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్రయాణికుల కారుగా మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన స్విఫ్ట్‌ రికార్డ్‌ను సాధించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన మారుతీ ఆల్టో కారు ఈ ఏడాది నవంబర్‌ నెలలో

మరింత సరళంగా జీఎస్టీ

Tuesday 25th December 2018

మరింత సరళంగా జీఎస్టీ! 12, 18 శాతం శ్లాబులను కలిపేయాలన్న జైట్లీ క్రమబద్ధీకరణ అవసరమని అభిప్రాయం 31 శాతం పన్నుతో దేశాన్ని కాంగ్రెస్‌ అణిచేసిందని విమర్శ న్యూఢిల్లీ: త్వరలో జీఎస్టీ మరింత సరళంగా మారనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంకేతాలిచ్చారు. జీఎస్టీలో 12, 18 శాతం పన్ను శ్లాబులను ఒక్కటి చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘ఆదాయం పెరుగుదల నేపథ్యంలో సాధారణ వినియోగ వస్తువులకు 12- 18 శాతం మధ్య ఒక్కటే

Most from this category