STOCKS

News


పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం

Friday 5th October 2018
news_main1538713766.png-20876

వాషింగ్టన్‌: అవినీతి చర్యలకు పాల్పడిన పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం విధించింది. మోసపూరిత విధానాలకు పాల్పడిన మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌పై రెండేళ్ల వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన ఈ కంపెనీ... భారత్‌లో ప్రపంచ బ్యాంకుకు చెందిన ప్రాజెక్టులకు పనిచేస్తోంది. భారత్‌కు చెందిన ఓలివ్‌ హెల్త్‌కేర్‌, జే మోది కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవి మోసం, అవినీతి చర్యలకు పాల్పడడంతో నిషేధం విధించినట్టు ప్రపంచ బ్యాంకు వార్షిక నివేదిక తెలియజేసింది. ఓలివ్‌ హెల్త్‌కేర్‌పై పదేళ్లు, జైమోదిపై ఏడున్నరేళ్ల పాటు ఈ నిషేధం అమలుకానుంది. మొత్తం 78 కంపెనీలు, వ్యక్తులపై ప్రపంచ బ్యాంకు ఈ చర్యలు తీసుకుంది. భారత్‌కే చెందిన ఏంజెలిక్యూ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌పై నాలుగున్నరేళ్లు, ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఆర్‌కేడీ కన్‌స్ట్రక్షన్స్‌పై ఏడాదిన్నరపాటు వేటు వేసింది. తత్వ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఎస్‌ఎంఈసీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, మెక్‌లియోడ్స్‌ ఫార్మాస్యూటికల్స్‌పై ఏడాదిలోపు నిషేధం విధించింది. 



You may be interested

సుజుకీ ‘వీ-స్ట్రోమ్‌ 650 ఎక్స్‌టీ’ విడుదల

Friday 5th October 2018

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా భారత మార్కెట్‌లో గురువారం తమ అడ్వెంచర్ టూరర్‌ బైక్‌ను విడుదలచేసింది. ‘వీ-స్ట్రోమ్‌ 650 ఎక్స్‌టీ ఏబీఎస్‌’ పేరిట విడుదలైన ఈ బైక్‌ ధర రూ.7.46 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఫోర్‌-సిలెండర్‌ 645 సీసీ ట్విన్‌ ఇంజిన్‌, అధునాతన భద్రతా ఫీచర్లు, యాంటీ లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌(ఏబీఎస్‌) ప్రత్యేకతలుగా పేర్కొంది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతోషి ఉచిడా మాట్లాడుతూ.. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 16.7 శాతం వృద్ధి

Friday 5th October 2018

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య స్థూలంగా 16.7 శాతం పెరిగాయి. విలువలో రూ.5.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే కాలంలో రిఫండ్స్‌ విలువ రూ.1.03 లక్షల కోట్లు. గత ఏడాది ఈ కాలంలో జరిగిన రిఫండ్స్‌కన్నా ఇది 30.4 శాతం అధికం. దీనితో నికర వసూళ్లు (రిఫండ్స్‌ సర్దుబాటు అనంతరం) 14 శాతం వృద్ధితో రూ.4.44 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ఒక

Most from this category