STOCKS

News


జేఎల్‌ఆర్‌ కార్ల ధరలు పెరుగుతాయ్‌ !

Wednesday 20th March 2019
news_main1553061038.png-24706

-కొన్ని మోడళ్లపై 4 శాతం పెరగనున్న ధరలు 
-వచ్చే నెల నుంచి అమల్లోకి 

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాస కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఎంపిక చేసిన మోడళ్ల ధరలను 4 శాతం వరకూ పెంచుతున్నామని, పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎమ్‌డీ రోహిత్‌ సూరి తెలిపారు. అయితే ఏ మోడళ్ల ధరలను పెంచేదీ ఆయన వెల్లడించలేదు. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడం లేదని సూరి పేర్కొన్నారు. ఈ కంపెనీ జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ బ్రాండ్ల కింద లగ్జరీ కార్లను విక్రయిస్తోంది. రూ.41 లక్షల నుంచి రూ.1.8 కోట్ల ఖరీదుండే కార్లను అమ్ముతోంది. కాగా టయోటా కంపెనీ కూడా కార్ల ధరలను ఏప్రిల్‌ నుంచి పెంచబోతున్నట్లు ఇటీవలనే ప్రకటించింది.



You may be interested

షావోమీ నుంచి రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్‌

Wednesday 20th March 2019

- ధర రూ. 4,499 న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమీ తాజాగా రెడ్‌మీ గో పేరిట భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ ఆవిష్కరించింది. దీని ధర రూ. 4,499గా ఉంటుంది. 1 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్‌) ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెన్సార్‌, క్వాడ్‌-కోర్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 చిప్‌ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు.

స్టార్టప్స్‌కి ఏం సందేశమిస్తున్నట్లూ..

Wednesday 20th March 2019

 సొంతంగా ఓ గొప్ప ఐటీ సంస్థను నిర్మించుకోలేరా - బలవంతపు టేకోవర్‌తో ఏం సాధించాలనుకుంటున్నారు - ఎల్‌అండ్‌టీపై మైండ్‌ట్రీ ప్రమోటర్ల ఘాటు వ్యాఖ్యలు బెంగళూరు: బలవంతపు టేకోవర్‌ యత్నాలు చేస్తున్న లార్సన్ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)పై ఐటీ సంస్థ మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు నిప్పులు చెరిగారు. దిగ్గజ సంస్థ అయి ఉండి .. సొంతంగా ఒక పెద్ద టెక్నాలజీ కంపెనీని నిర్మించుకోలేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి బలవంతపు టేకోవర్ ప్రయత్నాలతో విశ్వసనీయత.. నిజాయితీ గల

Most from this category