STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ ఏఎంసీలకు సెబి నోటీసులు

Tuesday 14th May 2019
news_main1557812560.png-25721

ఎస్సెల్‌ గ్రూప్‌లో పెట్టుబడులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సెబి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రుణాలు చెల్లించేందుకు ఎస్సెల్‌గ్రూప్‌నకు సెప్టెంబర్‌ దాకా గడువునిచ్చేలా ఎంఎఫ్‌లు కుదుర్చుకున్న ఒప్పంద చట్టబద్ధతను సెబి ప్రశ్నించింది. ఇలాంటి ఒప్పందాల కారణంగా ఈ ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు తమ పథకం మెచ్యూర్‌ అయినా పూర్తి మొత్తం పొందలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సెల్‌గ్రూప్‌ డెట్‌ సెక్యూరిటీస్‌లో ఈ ఎంఎఫ్‌లకు సంబంధించిన అన్ని పెట్టుబడుల నియమనిబంధనలను వెల్లడించాలని సెబి ఆదేశించింది. నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న ఎస్సెల్‌గ్రూప్‌ ఫౌండర్లు తమ షేర్లను ఎంఎఫ్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలను చెల్లించి తనఖా విడిపించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో తనఖా పెట్టుకున్న ఎంఎఫ్‌లు షేర్లను విక్రయించాలని భావించాయి. కానీ గ్రూప్‌నకు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, డిష్‌టీవీ షేర్లు ఇప్పటికే భారీగా పతనమై ఉన్నాయి. ఇప్పుడు వీటిని విక్రయిస్తే వచ్చే మొత్తం తక్కువ కనుక రుణాలు తీర్చేందుకు ఫౌండర్లకే మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకొని సెప్టెంబర్‌ 30వరకు గడువునిచ్చాయి. దీంతో ఎంఎఫ్‌లకు చెందిన ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్స్‌(ఎఫ్‌ఎంపీ)లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు పూర్తి మెచ్యూరిటీ మొత్తాలు అందలేదు. దీంతో సెబి జోక్యం చేసుకుంది. ఈ రెండు ఫండ్‌ హౌసుల ఎఫ్‌ఎంపీలు ఎస్సెల్‌ సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు పెట్టాయి. 
ఈ రెండు ఎంఎఫ్‌లతో పాటు కనీసం 9 ఫండ్‌హౌస్‌లు ఎస్సెల్‌ డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాయి. కొన్ని ఎఫ్‌ఎంపీల గడువు గతనెల ముగిసింది. కానీ ఎస్సెల్‌ నుంచి సొమ్ములు రాకపోవడంతో ఫండ్‌హౌసులు ఈ ఎఫ్‌ఎంపీ ఇన్వెస్టర్లకు సొమ్ములివ్వలేదు. సెప్టెంబర్‌లో ఈ ఇన్వెస్టర్లకు సొమ్ములిస్తామని కోటక్‌ చెబుతుండగా, పెట్టుబడులను మరో 380 రోజులకు రోలోవర్‌ చేసుకోమని హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్టర్లకు సూచించింది. దీంతో సెబి వీటి నిర్ణయాలను ప్రశ్నిస్తూ షోకాజ్‌ నోటీసులు పంపింది. తనఖా ఉన్న షేర్లను విక్రయించి సొమ్ములు ఎందుకు చెల్లించలేదని, ఒకవేళ గడువు అనంతరం కూడా ఎస్సెల్‌గ్రూప్‌ సొమ్ములు అందించకుంటే పరిస్థితి ఏంటని సెబి ప్రశ్నించింది. తమకు షోకాజ్‌నోటీసులు అందినట్లు ఏంఎంసీలు నిర్ధారించాయి. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ లాభం 27 శాతం అప్‌

Tuesday 14th May 2019

మార్చి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 27 శాతం పెరిగి రూ. 2861.6 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 2256.68 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ రూ. 11586 కోట్లను చేరింది. కంపెనీ కొత్త అకౌంటింగ్‌ ప్రమాణాలకు మారినందున ఈ ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేము. కంపెనీ స్థూల ఎన్‌పీఏలు 1.22 శాతం నుంచి 1.18 శాతానికి దిగివచ్చాయి. క్యు4లో కంపెనీ

ఎంఎస్‌సీఐ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో మార్పులు

Tuesday 14th May 2019

ఎంఎస్‌సీఐ తాజాగా తన ఇండియా ఇండెక్స్‌, ఇండియా స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ల రివ్యూను పూర్తి చేసింది. రివ్యూలో భాగంగా కొన్ని మార్పులను చేపట్టింది. తాజా మార్పులు ఈ నెల 29 నుంచి అమల్లోకి వస్తాయి. మార్పులో భాగంగా ఎంఎస్‌సీఐ డొమెస్టిక్‌ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ నుంచి కాడిలా హెల్త్‌కేర్‌ను తొలగించి, ఐసీఐసీఐ లుంబార్డ్‌కు స్థానం కల్పించింది. దీంతో పాటు కొత్తగా 14 స్టాకులను స్మాల్‌క్యాప్‌ సూచీకి కలిపింది. ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, అబాట్‌

Most from this category