STOCKS

News


రీట్‌, ఇన్విట్‌లకు ఇక డిమాండ్‌!

Wednesday 24th April 2019
news_main1556080010.png-25310

కనీస సబ్‌స్క్రిప్షన్‌ను భారీగా తగ్గించిన సెబీ
చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌ఈఐటీ/రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఐన్‌వీఐటీ/ఇన్విట్‌)లను మరింత మందికి చేరువ చేసే దిశగా సెబీ నిర్ణయం తీసుకుంది. రీట్‌, ఇన్విట్‌ల ఐపీవో, ఫాలో ఆన్‌ ఆఫర్‌లకు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాలను తగ్గించింది. దీంతో రీట్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ లేదా ఫాలో ఆన్‌ ఆఫర్‌లో ఒక లాట్‌ కనీసం రూ.50,000 విలువకు తక్కువ కాకుండా ఉంటే చాలు. ఇన్విట్‌ ఇష్యూలోనూ కనీస పెట్టుబడి ఇకపై రూ.లక్ష ఉంటే సరిపోతుంది. ఇన్విట్‌ ఆస్తుల విలువలో కన్సాలిడేటెడ్‌ రుణాల మొత్తం, వాయిదా వేసిన చెల్లింపులు, నికర నగదు, నగదు సమాన మొత్తాలను 70 శాతానికి పెంచినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. వాస్తవానికి ఇప్పటి వరకు ఇన్విట్‌ ఆస్తుల్లో గరిష్టంగా 49 శాతం మొత్తానికే రుణాలకు పరిమితి ఉండగా, దీన్ని 70 శాతం చేసింది. ఇందుకోసం అదనపు ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. నిధుల సమీకరణ పరంగా ఈ మార్గదర్శకాలు ఇష్యూయర్లకు వెసులుబాటు కల్పిస్తాయని సెబీ పేర్కొంది. ప్రస్తుతానికి రీట్‌ ఇష్యూలకు కనీస సబ్‌స్క్రిప్షన్‌ మొత్తం రూ.2 లక్షలుగా ఉంటే, ఇన్విట్‌లకు రూ.10 లక్షలుగా ఉండడం గమనార్హం. 



You may be interested

ఏడాదిలో ఐపీఓకి!

Wednesday 24th April 2019

- సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎండీ భాస్కర్‌ బాబు - తెలుగు రాష్ట్రాల్లో తొలి బ్రాంచ్‌ ఆరంభం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఆర్‌.భాస్కర్‌ బాబు చెప్పారు. ఐపీఓ ద్వారా 450- 500 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి రూ.248 కోట్లు సమీకరించామని, ప్రస్తుతం బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్‌,

కొత్తగా 28 ఫ్లయిట్స్‌

Wednesday 24th April 2019

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌ విమాన సేవలు నిలిపివేసిన నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థల మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. తాజాగా దేశీయంగా ముంబై, న్యూఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ కొత్తగా 28 ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు స్పైస్‌జెట్ మంగళవారం వెల్లడించింది. ఏప్రిల్‌ 26 నుంచి ఇవి ప్రారంభమవుతాయని పేర్కొంది. ముంబై నుంచి జైపూర్‌, అమృత్‌సర్‌, మంగళూరు, కోయంబత్తూర్‌ రూట్లలో కొత్తగా సర్వీసులు

Most from this category