STOCKS

News


‘లీలా’హోటళ్ల విక్రయానికి సెబీ బ్రేక్‌

Thursday 25th April 2019
news_main1556163006.png-25341

హోటల్‌ లీలా వెంచర్‌ హోటళ్ల  అమ్మకం వ్యవహారం 
న్యూఢిల్లీ: హోటల్‌ లీలా వెంచర్‌ హోటళ్ల, ఇతర ఆస్తుల విక్రయాన్ని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఈ విక్రయాలను నిలిపేయాలని  సెబీ ఆదేశాలు జారీ చేసిందని హోటల్‌ లీలా వెంచర్‌ బుధవారం వెల్లడించింది. మరోవైపు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ముంబై ధర్మాసనం హోటల్‌ లీలా వెంచర్‌కు, ఈ కంపెనీ ప్రమోటర్లకు, ఈ కంపెనీ రుణదాత జేఎమ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు  నోటీసులు జారీ చేసింది. ఐటీసీ, ఐటీసీ ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగం రస్సెల్‌ క్రెడిట్‌లు సంయక్తంగా దాఖలు చేసిన పిటీషన్‌ ఆధారంగా ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. హటల్‌ లీలా వెంచర్‌ జారీ చేసిన వాటా మూలధనంలో ఐటీసీకి, రస్సెల్‌ క్రెడిట్‌కు కలపి 8.72 శాతం వాటా ఉంది. యాజమాన్య వ్యవహారాల్లో మైనారిటీ వాటాదారులకు ఉండే 10 శాతం కనీస షేర్‌హోల్డింగ్‌ నిబంధనను రద్దు చేయాలంటూ ఈ రెండు సంస్థలు పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ విషయమై తదుపరి విచారణను ఎన్‌సీఎల్‌టీ జూన్‌18కి వాయిదా వేసింది. 
రూ.3,950 కోట్ల డీల్‌...
హోటల్‌ లీలా వెంచర్‌ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఉదయ్‌పూర్‌ల్లో ఉన్న నాలుగు హోటళ్లను కెనడాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, బ్రూక్‌ఫీల్డ్‌కు రూ.3,950 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 



You may be interested

లాభాల ప్రారంభం- వెంటనే నష్టాల్లోకి...

Thursday 25th April 2019

ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 48 పాయింట్ల లాభంతో 39,101.78 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 11,735.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే నేడు ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ ప్యూచర్‌ కాంట్రాక్టు ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 15 పైసలు బలహీనపడి 70.01 స్థాయి వద్ద ప్రారంభం కావడం

2019లో సంపద సృష్టి ఎంతో ఈజీ!

Thursday 25th April 2019

కష్టమేనన్న ఎక్కువ మంది న్యూఢిల్లీ: ఎన్నికల ఏడాదిలో సంపద సృష్టికి మెండుగా అవకాశాలున్నాయనే ఆశావహ పరిస్థితి దేశంలోని అత్యధిక సంపన్నుల్లో వ్యక్తమవుతోంది. 28 శాతం మంది అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇది అంతర్జాతీయ సగటు 12 శాతం కంటే రెట్టింపు అని నైట్‌ఫ్రాంక్‌ సర్వే వెల్లడించింది. ఈ సంస్థ అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల దృక్పథాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. ఎన్నికల సంవత్సరం అయినప్పటికీ అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు దేశ వృద్ధి

Most from this category