STOCKS

News


‘పార్శ్వనాథ్‌’ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్!

Thursday 9th August 2018
news_main1533792197.png-19074

 న్యూఢిల్లీ: భారీగా 'డొల్ల కంపెనీలు'న్నట్టుగా అనుమానిస్తున్న సంస్థల జాబితాలో ఉన్న పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. కొన్ని వ్యాపార లావాదేవీల్లో కంపెనీ తీరు సందేహాస్పదంగా ఉన్నట్లు తేలడంతో ఈ మేరకు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2009-10 నుంచి 2011-12 మధ్య కాలానికి సంబంధించిన కాంట్రాక్టులు/ సబ్ కాంట్రాక్టులకు మాత్రమే ఈ విచారణ పరిమితమని పేర్కొంది. వ్యాపార, ఆర్థిక లావాదేవీల వివరాలు వెల్లడించడంలో కంపెనీ వాస్తవాలను వక్రీకరించిందేమో తేల్చడానికి స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించాలంటూ ఎక్స్చేంజీని సెబీ ఆదేశించింది. ఇందులో ప్రమోటర్లు, డైరెక్టర్లతో పాటు కీలక హోదాల్లో ఉన్న వారి పాత్రపై కూడా విచారణ జరపాలని సూచించింది. కంపెనీ లెక్కల్లో గోల్‌మాల్ జరిగిందన్న సందేహాలు నెలకొన్న నేపథ్యంలో కంపెనీ ఖాతాలు నిఖార్సయినవా లేదా అనేది తేల్చడానికి స్వతంత్ర ఆడిట్ అవసరమని భావిస్తున్నట్లు సెబీ హోల్‌టైమ్ మెంబర్‌ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. డొల్ల కంపెనీలుగా సందేహిస్తూ ప్రభుత్వం సెబీకి పంపిన 331 సంస్థల జాబితాలో పార్శ్వనాథ్ డెవలపర్స్ కూడా ఉంది. దీంతో ఈ సంస్థల ట్రేడింగ్ లావాదేవీలపై 2017 ఆగస్టు 7న సెబీ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత పార్శ్వనాథ్ సహా పలు సంస్థలపై ఆంక్షలు తొలగించినప్పటికీ విచారణ మాత్రం కొనసాగుతోంది. 



You may be interested

నిస్సాన్ నుంచి కొత్త మైక్రా

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇండియా తాజాగా కాంపాక్ట్ కారు మైక్రాలో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 5.03 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం). ఇది పెట్రోల్‌, డీజిల్ వేరియంట్స్‌లో లభిస్తుంది. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్‌, స్పీడ్ వార్నింగ్ డివైజ్, స్పీడ్ సెన్సింగ్ డోర్‌ లాక్‌, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయని నిస్సాన్ మోటర్ ఇండియా డైరెక్టర్ హర్‌దీప్ సింగ్ బ్రార్

హెచ్‌పీసీఎల్‌ లాభం 86 శాతం అప్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 86 శాతం ఎగసింది. గత క్యూ1లో రూ.925 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,719 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ తెలియజేసింది. అధిక రిఫైనింగ్‌ మార్జిన్ల కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ సీఎమ్‌డీ ముకేష్‌ కె. సురానా తెలిపారు.  నికర లాభం

Most from this category