News


ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Saturday 22nd September 2018
news_main1537592788.png-20468

న్యూఢిల్లీ: స్టీల్‌ రంగంలోని ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహణకు సెబీ శుక్రవారం ఆదేశించింది. అనుమానిత 331 షెల్‌ కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఉంది. దీంతో ఈ కంపెనీ ఖాతా పుస్తకాల్లో దుర్వినియోగం జరిగినట్టు అనుమానిస్తున్న సెబీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించడం గమనార్హం. ఓ స్వతంత్ర ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను నియమించాలని స్టాక్‌ ఎక్సేంజ్‌లను ఆదేశించింది. కంపెనీ ఆర్థిక వివరాలు, వ్యాపారాలకు సంబంధించి ఏదైనా తప్పుదోవ పట్టించడం జరిగిందేమో తనిఖీ చేయాలని కోరింది. అలాగే, కంపెనీకి సంబంధించి అకౌంట్‌ పుస్తకాలు లేదా నిధుల విషయంలో దుర్వినియోగం జరిగిందో తేల్చాలని ఆదేశించింది. కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు వారి వాటాలను విక్రయించకుండా, బదిలీ చేయకుండా ఆంక్షలు విధించింది. కేవలం ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల కొనుగోలుకే అనుమతించింది. మధ్యంత ఆదేశాల్లో వ్యక్తం చేసిన అభ్యంతరాలపై 30 రోజుల్లోపు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కంపెనీని సెబీ కోరింది. చట్టబద్ధమైన తమ బాధ్యతల నిర్వహణలో ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు, కీలక యాజమాన్యంలోని వ్యక్తులు విఫలమయ్యారని సెబీ పేర్కొంది. షెల్‌ కంపెనీలుగా అనుమానిస్తూ 331 కంపెనీల షేర్ల ట్రేడింగ్‌పై ఆంక్షలు విధిస్తూ 2017 ఆగస్ట్‌ 7న సెబీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నాటి జాబితాలో ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఉంది. 



You may be interested

జీడీపీ వృద్ధి రేటు మరింత పైకి

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌’ పెంచింది. గతంలో 7.4 శాతంగా అంచనా వేయగా, తాజాగా దాన్ని 7.8 శాతం చేసింది. జూన్‌ త్రైమాసికంలో జీడీపీ రేటు మెరుగ్గా నమోదవడమే తమ అంచనాల సవరణకు కారణమని తెలిపింది. నిజానికి జూన్‌ త్రైమాసికానికి జీడీపీ 7.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని ఫిచ్‌ అంచనా వేయగా, వాస్తవ వృద్ధి 8.2

రిలయన్స్ ఎంఏ చమురు క్షేత్రం మూసివేత

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లోని ఏకైక ఎంఏ చమురు క్షేత్రాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం తెలిపింది. ఇందులో ఉత్పత్తి పూర్తిగా నిల్చిపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. భారీగా నీరు, ఇసుక వచ్చి చేరుతుండటంతో ఈ క్షేత్రంలో కార్యకలాపాలు పెనుసవాలుగా మారాయని, దీంతో పాటు క్రమంగా ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 17న ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశామని రిలయన్స్ పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఇప్పటిదాకా 19

Most from this category