STOCKS

News


సెబీ ముందుకు త్వరలో చందా కొచర్‌..

Monday 10th September 2018
news_main1536557402.png-20123

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వ్యవహారంలో నిబంధనల ‍అతిక్రమణ ఆరోపణలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్‌, ఆమె భర్త దీపక్ కొచర్‌లను ప్రశ్నించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు కొందరు బ్యాంకు ఉన్నతాధికారుల్లో, వీడియోకాన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్స్‌కు కూడా సమనల్ు జారీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై వివిధ దర్యాప్తు సంస్థల విచారణ, కొచర్ కుటుంబ వ్యాపార లావాదేవీలు మొదలైనవన్నీ ఈ వారంలో జరిగే సెబీ బోర్డులో చర్చకు రావొచ్చని పేర్కొన్నాయి. ఇది మొత్తం వ్యవస్థపైనే ప్రభావం చూపే కేసు కావడంతో దీనిపై సెబీ, రిజర్వ్ బ్యాంక్‌, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తుండటమే ఇందుకు కారణమని వివరించాయి. ‍వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణాలివ్వడం, ప్రతిఫలంగా ఆ గ్రూప్‌ చీఫ్ వేణుగోపాల్ ధూత్‌ .. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌ సంస్థకు పెట్టుబడులు సమకూర్చడం జరిగిందంటూ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. భర్త వ్యాపార లావాదేవీల గురించి తనకు తెలియదంటూ చందా కొచర్ చెబుతుండగా, ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు బాసటగా నిల్చింది.   దీనిపై వివిధ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అటు ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు కూడా స్వతంత్ర ఎంక్వైరీ చేపట్టడంతో అది పూర్తయ్యేదాకా చందా కొచర్ సెలవులో ఉంటారు. ఆరోపణలు రుజువైతే ఐసీఐసీఐ బ్యాంక్‌కు సెబీ నిబంధనల ప్రకారం రూ. 25 కోట్ల దాకా జరిమానా పడొచ్చు. అటు కొచర్‌ కూడా రూ. 10 కోట్ల దాకా జరిమానా కట్టడంతో పాటు ఇతర చర్యలు కూడా ఎదుర్కొనాల్సి రావొచ్చు. 



You may be interested

ఎస్‌బీఐ ఫండ్‌పై రుణమిస్తారా ?

Monday 10th September 2018

ప్ర: నేను గతంలో ఎస్‌బీఐ డ్యుయల్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌లో రూ.40,000 వరకూ ఇన్వెస్ట్‌ చేశాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆపేశాను. నాకు ఇప్పుడు డబ్బులు అవసరమయ్యాయి. ఈ ఫండ్‌ తనఖాగా నాకు రుణాలు వచ్చే అవకాశాలున్నాయా ? -భవానీ, విజయవాడ  జ: మీ ఎస్‌బీఐ ఫండ్‌పై మీరు రుణం పొందవచ్చు. ఇతర ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, రుణాలు రావడం కష్టమే కానీ, ఎస్‌బీఐ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీరు ఓవర్‌డ్రాఫ్ట్‌  పొందే

ఎఫ్‌పీఐల కేవైసీ నిబంధనల్లో  మార్పులు !

Monday 10th September 2018

న్యూఢిల్లీ:  కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)ఊరటనిచ్చే నిర్ణయాన్ని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ  శనివారం తీసుకుంది.  ఈ కొత్త కేవైసీ నిబంధనలపై ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌. ఆర్‌. ఖాన్‌ అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి సంఘం పలు వివాదాస్పద విషయాలపై చాలా మార్పులను సూచించింది. ఈ సిఫార్సుల ప్రకారం ఎన్నారైలు, ఓసీఐలు (ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా), ఆర్‌ఐలు (రెసిడెంట్‌ ఇండియన్స్‌)

Most from this category