STOCKS

News


యూనియన్‌ బ్యాంక్‌ ఓపెన్‌ ఆఫర్‌కు మినహాయింపు

Saturday 23rd March 2019
Markets_main1553325267.png-24763

  • ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చిన సెబీ 

న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంక్ విషయంలో ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వకుండా ప్రభుత్వానికి మార్కెట్‌ నియంత్రణ సం‍స్థ, సెబీ మినహాయింపునిచ్చింది. యూనియన్‌ బ్యాంక్‌లో ప్రభుత్వం రూ.4,112 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులకు ప్రతిగా యూనియన్‌ బ్యాంక్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్లను ప్రభుత్వానికి జారీ చేస్తుంది. దీంతో యూనియన్‌ బ్యాంక్‌లో ప్రస్తుతం 67.43 శాతంగా ఉన్న ప్రభుత్వం వాటా 6.55 శాతం పెరిగి 73.98 శాతానికి చేరుతుంది. ఫలితంగా టేకోవర్‌ నిబంధనలు వర్తించి ప్రభుత్వం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రజల వద్ద ఉండే ఈక్విటీ షేర్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండనందున ప్రభుత్వం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సిన అవసరం  లేదని సెబీ స్పష్టతనిచ్చింది. ఓపెన్‌ ఆఫర్‌ విషయంలో మినహాయింపును ఇచ్చింది.



You may be interested

ఎల్‌పీజీ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి

Saturday 23rd March 2019

- కాలుష్య నియంత్రణకు ఇది కూడా చౌకైన ప్రత్యామ్నాయం - విధానపరమైన వెసులుబాటు చాలు.. సబ్సిడీలు అక్కర్లేదు - కేంద్రానికి ఆటో ఎల్‌పీజీ సంస్థల సమాఖ్య విజ్ఞప్తి న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆటో ఎల్‌పీజీ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలని ఇండియన్ ఆటో ఎల్‌పీజీ సంస్థల సమాఖ్య (ఐఏసీ) కోరింది. సబ్సిడీపై విక్రయించేందుకు విద్యుత్‌, హైబ్రీడ్ వాహనాల కోసం రూ. 10,000 కోట్ల

జనవరిలో 8.96 లక్షల నూతన ఉద్యోగాలు

Saturday 23rd March 2019

- 17 నెలల గరిష్టస్థాయికి ఉద్యోగ కల్పన న్యూఢిల్లీ: దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ సంస్థ తాజాగా విడుదలచేసిన డేటా ప్రకారం.. సంఘటితరంగంలో ఈ ఏడాది జనవరిలో 8,96,516 నూతన ఉద్యోగ కల్పన జరిగింది. ఇది ఏకంగా 17 నెలల గరిష్టస్థాయి కాగా.. గతేడాది ఇదేకాలంతో పోల్చితే 131 శాతం వృద్ధి చోటుచేసుకుంది. జనవరిలో 2.44 లక్షల

Most from this category