News


నెలాఖరుకు బీఓబీ, దేనా, విజయా బ్యాంకుల విలీన స్కీము ఖరారు..

Monday 24th December 2018
news_main1545625263.png-23187

ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంకు, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియకు సంబంధించిన స్కీమ్ ఈ నెలాఖరు కల్లా ఖరారు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందు కూడా దీన్ని ఉంచే అవకాశ౾ం ఉందని వివరించాయి. జనవరి 8 దాకా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్కీమ్‌పై ప్రస్తుతం కసరత్తు జరుగుతుండగా, తర్వాత మూడు బ్యాంకుల బోర్డులు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటరు సమకూర్చాల్సిన అదనపు మూలధనం వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విలీన బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కాగలవని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో విలీన బ్యాంకు దేశీయంగా ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత మూడో స్థానంలో ఉండనుంది.  

26న బ్యాంకుల సమ్మె
ప్రభుత్వ రంగంలోని మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా డిసెంబర్ 26న (బుధవారం) సమ్మెకు దిగనున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొననున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటు వేతనాల పెంపు డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్స్ శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 3.20 లక్షల మంది అధికారులు పాల్గొన్నారు. 
    ఈ మూడు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్రం సెప్టెంబర్‌లో ప్రతిపాదించింది.  అయితే, ఈ విలీనం వల్ల ఇటు బ్యాంకులకు గానీ అటు కస్టమర్లకు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, పైగా రెండు వర్గాల ప్రయోజనాలకు ప్రతికూలమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకులు ఏర్పాటు చేయొచ్చని కేంద్రం భావిస్తోందని, అయితే మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ కలిపేసినా కూడా టాప్ 10 గ్లోబల్ బ్యాంకుల్లో చోటు దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్‌, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ తదితర తొమ్మిది యూనియన్లు .. యూఎఫ్‌బీయూలో భాగంగా ఉన్నాయి. జన ధన యోజన, ముద్ర రుణాల వంటి వివిధ ప్రభుత్వ పథకాలను బ్యాంకులు అమలు చేస్తున్నాయని, విలీనం వల్ల పెద్ద సంఖ్యలో శాఖలు మూతబడే అవకాశం ఉండటంతో.. కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని యూనియన్లు పేర్కొన్నాయి. 


 



You may be interested

ప్రపంచ పరిణామాలు కీలకం..!

Monday 24th December 2018

న్యూఢిల్లీ: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్‌) వడ్డీ రేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ షట్‌డౌన్‌ వంటి ప్రతికూల పరిణామాలు గతవారంలో అంతర్జాతీయ మార్కెట్లను కుంగదీశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ గతవారంలో 1,655 పాయింట్లు (6.8 శాతం) పతనంకాగా, నాస్‌డాక్‌ 8.3 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీ సూచీలు సైతం భారీ పతనాన్ని నమోదుచేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 10,754 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50ని మించి రాబడి

Monday 24th December 2018

 యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ మార్కెట్లు పెరిగినప్పుడు లాభాలు పొందడం సులభమే. దాదాపు అన్ని స్టాక్స్‌ చెప్పుకోతగ్గ రాబడులను ఇస్తుంటాయి. దీంతో అసలు ఏ తరహా స్టాక్స్‌లో లాభాలు వస్తాయనే ఫండమెంటల్స్‌ను ఇన్వెస్టర్లు పట్టించుకోరు. కానీ, మార్కెట్లు కరెక్షన్‌లోకి వెళ్లినప్పుడు అప్పటి వరకు ఉన్న లాభాలను కాపాడుకోవడంతోపాటు నష్టాలను పరిమితం చేసుకోవాలంటే, అందు కోసం నాణ్యమైన స్టాక్స్‌పై దృష్టి సారించాల్సి ఉంటుంది. మార్కెట్లలో ప్రతికూల సమయాల్లోనూ అధిక వృద్ధికి అవకాశాలు ఉండి, తక్కువ

Most from this category