News


పీఎస్‌యూ బ్యాంకుల డౌన్‌గ్రేడ్‌?

Thursday 4th April 2019
news_main1554371642.png-24972

సుప్రీం తీర్పుతో పెరిగిన అనుమానాలు
దివాలా విధానాలు, మొండిపద్దుల వసూళ్లకు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు చెల్లవని తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పీఎస్‌యూ బ్యాంకులకు అశనిపాతం కానుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో తిరిగి పాత రుణ పునర్‌వ్యవస్థీకరణ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో బ్యాంకులపై పెట్టుకున్న ఆశలు కరిగిపోతాయని, త్వరలో వీటి రేటింగ్‌ల్లో, ఎర్నింగ్స్‌లో డౌన్‌గ్రేడ్‌ ఉండొచ్చని అషికా స్టాక్‌బ్రోకింగ్‌ అనలిస్టు అశుతోష్‌ మిశ్రా అంచనా వేశారు. ఆర్‌బీఐ ఆదేశాలతో ఇకపై బ్యాంకుల ఫలితాలు బాగుంటాయని చాలామంది అంచనాలు వేశారు. కానీ సుప్రీం తీర్పుతో మొండిపద్దులను వదిలించుకోవడం మరలా పాతరోజుల్లోలాగా సుదీర్ఘ ప్రక్రియ కానుంది. ముఖ్యంగా ఇండస్ట్రీస్‌, పవర్‌, సుగర్‌ రంగాల కంపెనీలకు ఇచ్చిన అప్పుల వసూలు మరలా మొదటికి రానుంది. అందువల్ల ఫలితాలు తిరిగి పేలవంగా మారవచ్చని మిశ్రా చెప్పారు. బ్యాంకులు తిరిగి పాత నమూనాలో ఎన్‌పీఏలను డీల్‌ చేయడమనేది తిరోగామి చర్యన్నారు. ఇది బ్యాంకుల బాలెన్స్‌షీట్లను దెబ్బతీస్తుందని, బలహీనపరుస్తుందని విశ్లేషించారు. 
సుప్రీం నిర్ణయం ఆర్‌బీఐ నిర్ణయాన్ని దెబ్బతీసినట్లుందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకుల ఎర్నింగ్స్‌ డౌన్‌గ్రేడ్స్‌ ఉండొచ్చని అంచనా వేసింది. 2017-18 సంవత్సరంలో పీఎస్‌యూ బ్యాంకులన్నీ కలిపి రూ. 85400 కోట్ల నష్టాలు మూటకట్టుకున్నాయి. మొత్తం 21 పీఎస్‌బీల్లో ఆరు బ్యాంకులు భారీగా దెబ్బతిన్నాయి. 12 బ్యాంకులు మూడో త్రైమాసికంలో నష్టాన్ని ప్రకటించాయి. ఇవన్నీ గమనించిన ప్రభుత్వం, ఆర్‌బీఐ మొండిపద్దుల వసూళ్లకు కఠినంగా వ్యవహరించే యత్నాలు ఆరంభించాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో ఆర్‌బీఐ నూతన నిబంధనలను జారీ చేసింది. కానీ తాజాగా సుప్రీంకోర్టు వీటిని తోసిపుచ్చింది. ఇకపై ఎన్‌పీఏలకు సంబంధించి బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం మరలా వచ్చిందని, దీంతో ఎన్‌సీఎల్‌టీకి వెళ్లే కేసులు తగ్గవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు మహేశ్‌ అభిప్రాయపడ్డారు. తీర్పు ప్రభావం తెలియాలంటే కనీసం ఒకటి రెండు త్రైమాసికాలు గడవాల్సిఉంటుందన్నారు. 


PSB

You may be interested

'జెట్‌'లో జోక్యం చేసుకోం

Thursday 4th April 2019

- డీల్స్‌కి ప్రభుత్వ తోడ్పాటేమీ ఉండదు - బ్యాంకులు, యాజమాన్యం చూసుకోవాల్సిందే - స్పష్టం చేసిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్‌వేస్‌ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు.‍ జెట్ ఎయిర్‌వేస్‌లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తక్షణ గృహరుణం!

Thursday 4th April 2019

దేశంలో పెరిగిపోతున్న సరసమైన గృహనిర్మాణ కార్యక్రమానికి తగినట్లుగా ఐసీఐసీఐ బ్యాంకు సరికొత్త గృహరుణ ఆఫర్లను ప్రకటించింది. ఈ పథకాల కింద కస్టమర్లు తక్షణమే కొత్త గృహరుణాన్ని లేదా కొత్త టాప్‌అప్‌ లోన్‌ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ ప్రాసెస్‌ మొత్తం డిజిటల్‌గానే పూర్తవుతుంది. ఈ పథకం కింద కొత్త ఇంటి కోసం కోటి రూపాయల వరకు రుణాన్ని అందిస్తారు. కస్టమర్‌ వయసును బట్టి గరిష్ఠంగా 30 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ఈ

Most from this category