STOCKS

News


ముగ్గురు ‘ఆమ్రపాలి’ డైరెక్టర్లకు పోలీసు కస్టడీ

Wednesday 10th October 2018
news_main1539148854.png-21006

న్యూఢిల్లీ: తమ ఆదేశాలను పాటించని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆమ్రపాలి గ్రూపుపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని డాక్యుమెంట్లను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం సమర్పించాలన్న తమ ఆదేశాలను అమలు చేయకుండా, కోర్టుతో దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ధర్మాసనం మండిపడింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం ఆమ్రపాలి గ్రూపునకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను పోలీసు కస్టడీకి ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూపు డైరెక్టర్లు అనిల్‌కుమార్‌ శర్మ, శివ్‌ప్రియా, అజయ్‌కుమార్‌లు కోర్టు విచారణకు హాజరు కాగా... గ్రూపు పరిధిలోని మొత్తం 46 సంస్థలకు సంబంధించి డాక్యుమెంట్లు సమర్పించే వరకు వారు పోలీసు కస్టడీలోనే ఉంటారని కోర్టు పేర్కొంది. ఏం జరుగుతోంది? కోర్టు ఆదేశాలను ఘోరంగా ఉల్లంఘించడంతోపాటు ఈ దాగుడు మూతలు ఏంటని ఆమ్రపాలి గ్రూపు తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు గౌరవంతోనే ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 42,000 ఫ్లాట్లకు సంబంధించి డబ్బులు చెల్లించినప్పటికీ తమకు స్వాధీనం చేయలేదంటూ పెద్ద ఎత్తున దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తున్న విషయం గమనార్హం. 
ఇంకో అవకాశం ఇచ్చేది లేదు...
విచారణలో భాగంగా ఆమ్రపాలి గ్రూపు సంస్థల ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని కోర్టు ఆదేశిస్తూ, ఇందుకు రవి భాటియా, పవన్‌ కుమార్‌ అగర్వాల్‌ అనే ఆడిటర్లకు లోగడ బాధ్యతలు అప్పగించింది. అయితే, తమకు కంపెనీల డాక్యుమెంట్లు అందలేదని ఆడిటర్లు తెలియజేశారు. అయినా, డాక్యుమెంట్లు సమర్పించినట్టు ఆమ్రపాలి గ్రూపు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం కఠినంగా స్పందించింది. మరోసారి అబద్ధం చెబుతున్నారని, డాక్యుమెంట్లు అందడం లేదని వారు చెబుతున్నందున, వాటిని అందించాల్సిన తొలి బాధ్యత మీపైనే ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇందుకు చివరి అవకాశం ఇవ్వాలని కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. 46 గ్రూపు సంస్థల్లో కేవలం రెండు సంస్థల డాక్యుమెంట్లే ఇచ్చినట్టు ఆడిటర్ల నివేదిక తెలియజేస్తున్నందున... అన్ని డాక్యుమెంట్లను వారికి అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతూ... ఆయా డాక్యుమెంట్లు అన్నింటినీ సీజ్‌ చేసి ఆడిటర్లకు అందజేయాలని ఢిల్లీ పోలీసు, గ్రేటర్‌ నోయిడా, నోయిడా పోలీసులను ఆదేశించింది. కస్టడీలోకి తీసుకున్న డైరెక్టర్ల సాయంతో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించింది. ఆమ్రపాలి గ్రూపు మిగతా డైరెక్టర్లు తమ పాస్‌పోర్టులను పోలీసులకు స్వాధీనం చేసి, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. You may be interested

రూ.45,000 కోట్ల ఆస్తులు కొంటాం

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: నిధుల కటకటతో కష్టాలుపడుతున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లను ఆదుకోవడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులను(రుణ పోర్ట్‌ఫోలియోలను) రూ.45,000 కోట్ల మేర కొనుగోలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.  ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌  చంద్ర గార్గ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఎస్‌బీఐ నిర్ణయంతో ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్య తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు రుణాల చెల్లింపుల్లో విఫలం

‘నగదు రవాణా’లో మోసాలు తగ్గుతాయి

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ నూతన నిబంధనలు నగదు రవాణా రంగానికి మేలు చేస్తాయని సంబంధిత పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి నిత్యం రూ.15,000 కోట్ల నగదు రవాణా చేసే ఈ రంగంలో భద్రత పెరగడంతోపాటు, మరిన్ని ఉద్యోగాలు కూడా వస్తాయని క్యాష్‌ లాజిస్టిక్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఈ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన విధానాలు తీసుకొచ్చేలా చేస్తాయని, ప్రజాధనానికి భద్రత ఇనుమడిస్తుందని పేర్కొంది. స్వల్ప కాలంలో

Most from this category