STOCKS

News


బీఓబీలో విజయా, దేనా విలీనంపై స్టేకు సుప్రీం నో

Friday 29th March 2019
Markets_main1553849561.png-24858

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్‌, దేనాబ్యాంక్‌ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. పలు బ్యాంక్‌ ఆఫీసర్ల అసోసియేషన్లు ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. విజయా, దేనా బ్యాంకులు ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తర్వాత రెండవ బ్యాంకుగా ఆవిర్భవించనుంది. ఇప్పటి వరకూ ఈ హోదాను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పొందుతోంది. ఈ విలీన నిర్ణయాల్లో పలు తప్పులు జరిగాయని బ్యాంక్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వకేట్‌ శ్యామ్‌ దివాన్‌ తన వాదనల్లో పేర్కొన్నారు. అలాంటిదేమీ లేదని, తగిన మార్గదర్శకాల ప్రకారమే నిర్ణయం జరిగిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తరఫున తన వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహ్‌తంగ్‌ పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, న్యాయమూర్తి వినీత్‌ శరణ్‌ నేతృత్వంలోని డివిజనల్‌ బెంచ్‌, ఈ అంశంపై తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. 



You may be interested

నీతీ ఆయోగ్‌ను సంస్కరించాలి: వైవీరెడ్డి

Friday 29th March 2019

న్యూఢిల్లీ: నీతీ ఆయోగ్‌ను సంస్కరించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి పేర్కొన్నారు. నీతీ ఆయోగ్‌ నిర్ణయాలు ‘‘విస్తృత ప్రాతిపదికన ఆమోదం’’ పొందడంలేదని పేర్కొన్న ఆయన, ‘‘అంశాల పట్ల నిర్దిష్ట కేంద్రీకరణ’’ కూడా లేదని విశ్లేషించారు. కేంద్ర, రాష్ట్రాలను సమన్వయం చేస్తూ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా నీతీ ఆయోగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య

కొత్త కార్లొస్తున్నాయ్‌...

Friday 29th March 2019

- బరిలో ఎంజీ, కియా, సిట్రోయెన్‌ - మూడేళ్లలో డజను పైగా మోడల్స్‌ - మాస్‌ ప్రీమియం విభాగంపైనే దృష్టి - జూన్‌లో ఎంజీ హెక్టార్‌ ఎంట్రీ న్యూఢిల్లీ: దేశీ కార్ల మార్కెట్‌లో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై మరిన్ని అంతర్జాతీయ ఆటోమొబైల్‌ దిగ్గజాలు కన్నేశాయి. మూడు అంతర్జాతీయ కార్ల కంపెనీలు భారత మార్కెట్లో వాహనాలను ప్రవేశపెట్టబోతున్నాయి. బ్రిటన్‌ సంస్థ ఎంజీ మోటార్, దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్, ఫ్రెంచ్‌ దిగ్గజం సిట్రోయెన్‌ కంపెనీలు ఈ జాబితాలో

Most from this category