STOCKS

News


‘అమ్రపాలి’పై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లండి!

Friday 7th September 2018
news_main1536297120.png-20053

న్యూఢిల్లీ: రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న అమ్రపాలి గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీని (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) ఆశ్రయించడానికి కార్పొరేషన్‌ బ్యాంక్‌కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అమ్రపాలి గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు కార్పొరేషన్‌ బ్యాంక్‌ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు లేకుండా ఈ కేసులో తదుపరి ప్రొసీడింగ్స్‌ చేపట్టకూడదని ఎన్‌సీఎల్‌టీకి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నియంత్రణలు విధించింది. అంతకుముందు బ్యాంక్‌ తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అతున్నత ధర్మస్థానానికి తన వాదనలు వినిపిస్తూ, అమ్రపాలి గ్రూప్‌నకు కార్పొరేషన్‌ బ్యాంక్‌ రూ.270 కోట్ల రుణాలు ఇచ్చిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎన్‌సీఎల్‌టీకి బ్యాంక్‌ ఇప్పుడు వెళ్లలేకపోతే, లిటిగేషన్‌కు సంబంధించి కేసు ఫైల్‌ చేసే లిమిటేషన్‌ సమయం దాటిపోతుందని వివరించారు. నవంబర్‌ 30వ తేదీ వరకూ లిమిటేషన్‌ సమయం ఉందని ఈ సందర్భంగా వివరించారు.  
వేలానికి 16 ఆస్తులు...
గ్రూప్‌నకు చెందిన 16 ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా వచ్చిన నిధులను... నిలిచిపోయిన ప్రాజెక్టుల పని ప్రారంభించడానికి ప్రభుత్వ రంగ ఎన్‌బీసీసీ వినియోగించుకోడానికి కూడా వీలు కల్పించింది. నిలిచిపోయిన 15 హౌసింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్‌ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని... ఇందుకు దాదాపు రూ.8,500 కోట్ల నిధులు కావాలని ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్‌బీసీసీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. 
సీఎండీ ఆస్తులపైనా ఆదేశాలు..
ఈ కేసులో గ్రూప్‌ సీఎండీ అనిల్‌ శర్మ ఆస్తులనూ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. తన ఆస్తుల విలువ రూ.67 కోట్లు అని ఇప్పుడు ఆయన డిక్లేర్‌ చేయడాన్ని ప్రస్తావిస్తూ, 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ సందర్భంగా రూ.847 కోట్ల ఆస్తులున్నట్లు శర్మ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడాన్ని ప్రస్తావించింది. నాలుగేళ్ల కాలంలో ఈ ఆస్తులు ఎలా కరిగిపోయాయని ప్రశ్నించింది. శర్మ, ఇతర డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యుల ఆస్తుల జాబితా నాలుగురోజుల్లో సమర్పించాలని ఆదేశించిన న్యాయస్థానం కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 12కు వాయిదా వేసింది. 46 గ్రూప్‌ కంపెనీలు, వాటి డైరెక్టర్లు, ప్రమోటర్లు, వారి జీవిత భాగస్వాములు,  పిల్లల ఆస్తులకు సంబంధించి రెండు నెలల్లో ఫోరిన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గృహ కొనుగోలుదారులను వంచించి తీవ్రమైన మోసానికి గ్రూప్‌ పాల్పడిందని సుప్రీంకోర్టు పేర్కొంది. You may be interested

అరబిందో చేతికి సాండోజ్‌

Friday 7th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అరబిందో చేతికి అమెరికాకు చెందిన సాండోజ్‌ డెర్మటాలజీ చిక్కింది. యూఎస్‌కు చెందిన నోవార్టిస్‌ ఏజీ జనరిక్‌ వ్యాపార విభాగమే ఈ సాండోజ్‌. డీల్‌ విలువ 1 బిలియన్‌ డాలర్‌ (రూ.7,200 కోట్లు). దీనికింకా అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమీషన్‌ అనుమతి ఇవ్వాల్సి ఉందని.. 2019 నాటికి ఈ డీల్‌ మూగిసే అవకాశముందని అరబిందో ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆర్ధిక

ఎన్‌సీఎల్‌టీకి జీఎంఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ ఎనర్జీ ఎన్‌పీఏ కేసు!

Friday 7th September 2018

ముంబై: జీఎంఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ సహా 11 విద్యుత్‌ ప్రాజెక్టుల ఎన్‌పీఏ ఖాతాలను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ప్రయాగ్‌రాజ్‌ పవర్‌ జనరేషన్‌, జై ప్రకాష్‌ పవర్‌ వెంచర్‌, ఎస్‌కేఎస్‌ ఇస్పాత్‌ పవర్‌, మీనాక్షి ఎనర్జీ, అథెనా ఛత్తీస్‌గఢ్‌ వపర్‌ జబువా, కేఎస్‌కే మహానంది, కోస్టల్‌ ఎనర్జెన్‌, జిందాల్‌ ఇండియా థర్మల్‌ పవర్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2,000 కోట్లకు పైగా రుణాలు

Most from this category