STOCKS

News


వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు 'యోనో' యూజర్లు..!

Thursday 9th August 2018
news_main1533792742.png-19083

ముంబై: డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఒకే యాప్‌ ద్వారా నిర్వహించుకునేలా 'యోనో' (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) పేమెంట్‌ యూప్‌ను అందుబాటులో ఉంచిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)... ఈ యాప్‌ వినియోగాన్ని వేగంగా విస్తృత పరుస్తోంది. నగదు బదిలీ, డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం, డిజిటల్‌గానే బ్యాంక్‌ ఖాతా ప్రారంభం వంటివి ఇపుడు యోనో ప్రత్యేకతలుగా ఉన్నాయి. ప్రస్తుతం 25 లక్షల మంది యూజర్లు ఉన్న ఈ యాప్‌ వినియోగదారుల సంఖ్యను వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు చేర్చడానికి లక్ష్యించామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. యోనో ప్రస్తుతం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌గా ఉందని, దీన్ని త్వరలోనే బడ్డీతో అనుసంధానం చేస్తామని తెలియజేశారు. బుధవారమిక్కడ మోప్యాడ్‌ (మల్టీ ఆప్షన్‌ పేమెంట్‌ యాక్సెప్టెన్స్‌ డివైస్‌) పేరిట పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్మినల్‌ పరికరాన్ని ఆరంభించారు. కార్డులు, భారత్‌ క్యూఆర్‌, యూపీఐ, ఎస్‌బీఐ బడ్డీ (ఈ- వాలెట్‌) ద్వారా ఈ పీఓఎస్‌ వద్ద చెల్లింపులు చేయొచ్చు. ఈ విధానంలో కస్టమర్లు వారు చేసిన చెల్లింపులకు ఆధారంగా చార్జ్‌ స్లిప్‌లు పొందే అవకాశం ఉంది. ఎస్‌బీఐకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6.23 లక్షల పీఓఎస్‌ పరికరాలున్నాయి. దశల వారీగా ఈ పరికరాలన్నిట్లో మోప్యాడ్‌ సేవలను అందుబాటులోకి తెస్తామని రజనీష్‌ కుమార్‌ తెలియజేశారు.



You may be interested

చైనాపై అమెరికా మరో దఫా టారిఫ్‌ల వడ్డింపు!

Thursday 9th August 2018

వాషింగ్టన్‌:  చైనా, అమెరికాల మధ్య టారిఫ్‌ల యుద్ధం మరింతగా ముదురుతోంది. తాజాగా మరో 16 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై ఏకంగా 25 శాతం మేర సుంకాలు విధించే ప్రతిపాదనను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ రెండో విడత టారిఫ్‌లు ఆగస్టు 23 నుంచి అమల్లోకి రానున్నాయి. తొలి విడతగా జూలై 6న 34 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా

గత నాలుగేళ్లలో రూ.80 వేలకు తలసరి ఆదాయం!

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: భారత్‌ సగటు తలసరి ఆదాయం గడచిన నాలుగేళ్లలో రూ.80 వేలకు చేరింది. గణాంకాల శాఖ సహాయమంత్రి విజయ్‌ గోయెల్‌ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.  ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- 2014-15 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ.79,882. 2001-12 నుంచి 2014-15 మధ్య కాలంలో తలసరి ఆదాయం రూ.67,594.  నాలుగేళ్లలో వేర్వేరుగా... ఆర్థిక సంవత్సరం    వృద్ధి (శాతం)  

Most from this category