STOCKS

News


రూ.45,000 కోట్ల ఆస్తులు కొంటాం

Wednesday 10th October 2018
news_main1539148908.png-21007

న్యూఢిల్లీ: నిధుల కటకటతో కష్టాలుపడుతున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లను ఆదుకోవడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులను(రుణ పోర్ట్‌ఫోలియోలను) రూ.45,000 కోట్ల మేర కొనుగోలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.  ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌  చంద్ర గార్గ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఎస్‌బీఐ నిర్ణయంతో ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్య తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు రుణాల చెల్లింపుల్లో విఫలం కావడం.. ఈ ప్రభావం ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌పై తీవ్రంగా ఉండటం తెలిసిందే.
మాకూ ప్రయోజనకరమే...
ప్రస్తుత ఏడాది రూ.15,000 కోట్ల మేర పోర్ట్‌ఫోలియో ఆస్తులు కొనుగోలు చేయాలని గతంలోనే నిర్ణయించామని ఎస్‌బీఐ ఎమ్‌డీ పి.కె. గుప్తా తెలిపారు. అయితే తాజా అంతర్గత మదింపు కారణంగా ఈ మొత్తాన్ని రూ.20,000 నుంచి రూ.30,000 కోట్లకు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు ఆకర్షణీయ ధరలకు లభిస్తుండటంతో ఇది తమకు మంచి వాణిజ్య అవకాశమని వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల ఎస్‌బీఐకీ, ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రయోజనకరమేనని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్య తీరుతుందని, మరోవైపు తమకు ఉత్తమమైన రుణ పోర్ట్‌ఫోలియోలు లభిస్తాయని వివరించారు. మరోవైపు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నియంత్రణ సం‍స్థ నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) సోమవారమే మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల  రీఫైనాన్స్‌ పరిమితిని రూ.24,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచింది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు కొంత ఊరట లభించనున్నది. 


    
    



You may be interested

పిక్సెల్ త్రీ విడుదల..

Wednesday 10th October 2018

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ సిరీస్‌లో గూగుల్ మంగళవారం పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్‌ పేరిట కొత్త ఫోన్స్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో పిక్సెల్ 3 రేటు రూ. 71,000 నుంచి రూ. 80,000 దాకా ఉండనుండగా, పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్‌ రేటు రూ. 83,000 నుంచి రూ. 92,000దాకా ఉంటుంది. ఇవి 64జీబీ, 128 జీబీ వెర్షన్లలో లభిస్తాయి. అమెరికా మార్కెట్లో ‍అక్టోబర్ 19 నుంచి, భారత్‌ సహా మిగతా దేశాల్లో

ముగ్గురు ‘ఆమ్రపాలి’ డైరెక్టర్లకు పోలీసు కస్టడీ

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: తమ ఆదేశాలను పాటించని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆమ్రపాలి గ్రూపుపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని డాక్యుమెంట్లను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం సమర్పించాలన్న తమ ఆదేశాలను అమలు చేయకుండా, కోర్టుతో దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ధర్మాసనం మండిపడింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం ఆమ్రపాలి గ్రూపునకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను పోలీసు కస్టడీకి ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూపు డైరెక్టర్లు

Most from this category