STOCKS

News


అంచనాలను అందుకోని ఎస్‌బీఐ

Friday 10th May 2019
news_main1557478550.png-25664

దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. క్యు4లో బ్యాంకు రూ. 838.40 కోట్ల నికరలాభం నమోదు చేసింది. అంతకుముందేడాది ఇదే సమయంలో బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో లాభాలు ప్రకటించినా, ఈ లాభం అనలిస్టులు అంచనా వేసిన రూ. 4890 కోట్ల కన్నా చాలా తక్కువ. క్యు3లో బ్యాంకు రూ. 3954 కోట్ల లాభం ఆర్జించింది. అయితే అసెట్‌ నాణ్యత పరంగా బ్యాంకు మెరుగుపడింది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 8.71 శాతం నుంచి 7.73 శాతానికి, నెట్‌ ఎన్‌పీఏలు 3.95 శాతం నుంచి 3.01 శాతానికి దిగివచ్చాయి. గతేడాది రూ. 28వేల కోట్లున్న ప్రొవిజన్లు ప్రస్తుతం రై. 16502 కోట్లకు తగ్గాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ నిష్పత్తి 78.73 శాతంగా ఉంది. తాజా స్లిపేజ్‌లు క్యు3లో రూ. 4523 కోట్లుండగా ప్రస్తుతం రూ. 7505 కోట్లకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం 14.91 శాతం పెరుగుదలతో రూ. 22953 కోట్లకు చేరింది. మధ్యాహ్నం 2.23 నిమిషాలకు ఎస్‌బీఐ షేరు 300 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 


SBI

You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Friday 10th May 2019

మెటల్‌ షేర్లు శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి భారీగా నష్టపోయాయి. మెటల్‌ షేర్లకు ప్రాతనిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు దాదాపు 2శాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్ల నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండంతో మన మార్కెట్లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. టాటా స్టీల్‌తో జాయింట్‌వెంచర్‌ ఏర్పాటు విఫలం కావచ్చని జర్మనీ స్టీల్ దిగ్గజ కంపెనీ థిసేన్‌క్రుప్ భావిస్తున్నట్లు రాయిటర్‌ మీడియా సంస్థ ఒక కథనాన్ని వెల్లడించడంతో టాటాస్టీల్‌

29000 పైకి బ్యాంకు నిఫ్టీ

Friday 10th May 2019

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో రికవరీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 29000 స్థాయిని తిరిగి అందుకొంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. నేడు మార్కెట్‌ లాభాల ప్రారంభంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 28,927.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరగడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌కు తనకు సాంకేతికంగా కీలకమైన 29000 స్థాయిని అందుకుంది. ఇండెక్స్‌లో ఆర్‌బీఎల్‌,

Most from this category