STOCKS

News


ఎస్‌బీఐ లాభం రూ.945 కోట్లు

Monday 5th November 2018
news_main1541414223.png-21726

దేశీ దిగ్గజ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌బీఐ) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ స్టాండలోన్‌ నికర లాభం 40 శాతం క్షీణతతో రూ.945 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,581 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్యూ1లో బ్యాంక్‌ ఏకంగా రూ.4,875 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.66,607 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.65,429 కోట్లుగా ఉంది. 
ప్రస్తుత క్యూ2లో బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. త్రైమాసికం పరంగా చూస్తే.. స్థూల మొండి బకాయిలు 9.95 శాతానికి (రూ.2.09 లక్షల కోట్లు) తగ్గాయి. క్యూ1లో (ఏప్రిల్‌-జూన్‌) ఇవి 10.69 శాతంగా (రూ.2.12 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇక నికర ఎన్‌పీఏలు 5.29 శాతం (రూ.99,263 కోట్లు) నుంచి 4.84 శాతానికి (రూ.94,810 కోట్లు) తగ్గాయి. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) ఈ క్యూ2లో రూ.20,905 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఎన్‌ఐఐ రూ.18,585 కోట్లుగా నమోదయ్యింది. లిక్విడిటీ కవరేజ్‌ రేషియో 140 శాతంగా ఉంది. క్వార్టర్‌ పరంగా స్థూల స్లిపేజ్‌లు రూ.14,349 కోట్ల నుంచి రూ.10,888 కోట్లకు తగ్గాయి. నికర స్లిపేజ్‌లు రూ.10,725 కోట్లు. క్యూ2 స్లిపేజ్‌ రేషియో 2 శాతంగా ఉంది. క్యూ1లో ఈ రేషియో 1.95 శాతం.   

కాగా ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో 3.36 శాతం వృద్ధితో రూ.295 వద్ద ముగిసింది. క్యూ2 ఫలితాలు వెల్లడి అవుతున్న సమయంలో షేరు ధర రూ.300ని కూడా తాకింది. 


SBI

You may be interested

ఈ 10 షేర్లు తారాజువ్వలు..!

Monday 5th November 2018

గతవారం మార్కెట్‌ ట్రేడింగ్‌లో బుల్స్‌ పట్టు ఒక్కసారిగా పెరిగింది. సెన్సెక్స్‌ 1,662 పాయింట్లు (5 శాతం) పెరిగి 35,011 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 523 పాయింట్లు (5 శాతం) పెరిగి 10,553 పాయిం‍ట్లకు చేరుకుంది. మొదటి వారంలో స్మార్ట్‌ రికవరీని సాధించిన సూచీలు.. ఈ నెలలో ఇదే స్థాయి జోరును ప్రదర్శించవచ్చని, దీపావళి సందర్భంగా 10 షేర్లు మంచి రాబడిని అందించగలవని పలువురు దలాల్‌ స్ట్రీట్‌ పండితులు సూచిస్తున్నారు. 10,700-10,840

టాటాతో చర్చలు.. జెట్‌ 10% అప్‌

Monday 5th November 2018

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర సోమవారం ఏకంగా 10 శాతానికి పైగా ఎగసింది. టాటా గ్రూప్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ మధ్య రెండో విడత చర్చలు ప్రారంభమైనట్లు మీడియాలో వార్తలు వెలువడటం ఇందుకు కారణం. సీఎన్‌బీసీ-టీవీ18 ప్రకారం.. టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో సంస్థ ప్రమోటర్ల వాటాను, ఇతిహద్‌ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ డీల్‌ కుదిరితే.. అప్పుడు

Most from this category